
సాక్షి, ముంబై: ఎన్టీఆర్ బయోపిక్‌కు సంబంధించి ఓ ముఖ్యమైన అప్ డేట్. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక జరిగిపోయింది. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు పాత్ర కోసం సచిన్ ఖేద్కర్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సచిన్ ప్రకటించటం విశేషం. మరాఠీ నటుడైన సచిన్ పలు బాలీవుడ్, దక్షిణాది చిత్రాల్లో కూడా నటించారు.
జనతా గ్యారేజ్, నేను లోకల్ చిత్రాలతో తెలుగువారికి ఆయన సుపరిచితుడే. 1985లో టీడీపీలో తిరుగుబాటు జెండా ఎగరేసిన నాదెండ్ల, ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి గద్దె దింపిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్‌ను చిత్రంలో ఎలా చూపించబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈ చిత్ర డైరెక్టర్, నటీనటులు, టెక్నీషియన్ల విషయంలో మేకర్లు ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.