అన్నతో కలిసి నటించనున్న ఎన్టీఆర్ | Ntr, Kalyan ram multi starrer movie in vakkantam vamsi direction | Sakshi
Sakshi News home page

అన్నతో కలిసి నటించనున్న ఎన్టీఆర్

Published Wed, Jan 20 2016 6:28 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

అన్నతో కలిసి నటించనున్న ఎన్టీఆర్

అన్నతో కలిసి నటించనున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఫుల్ జోష్లో ఉన్నాడు. టెంపర్ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన జూనియర్ ఇటీవల సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతోతో తన కమర్షియల్ స్టామినాను కూడా ప్రూవ్ చేసుకున్నాడు. భారీ పోటీలో కూడా కోట్ల వసూళ్లతో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా మాస్ హీరోలకు ఓవర్సీస్ మార్కెట్పై పట్టు కష్టం అన్న టాక్ చెరిపేస్తూ విదేశాల్లో కూడా రికార్డ్ వసూళ్లను రాబడుతున్నాడు.

ఇదే జోష్లో ఇప్పుడో ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటించడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు కూడా రాకముందే తరువాత చేయబోయే ప్రాజెక్ట్ను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. అంతేకాదు ఆ సినిమాలో తన అన్న కళ్యాణ్ రామ్తో కలిసి నటించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఇప్పటికే వక్కంతం వంశీ, ఇద్దరు నందమూరి హీరోలు కలిసి నటించడానికి కావలసిన కథను రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. షేర్ సినిమా తరువాత వేరే సినిమాకు సైన్ చేయని కళ్యాణ్ రామ్, ఈ మల్టీ స్టారర్ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులను చూసుకోనున్నాడు. త్వరలోనే నందమూరి వారసుల మల్టీ స్టారర్కు సంబందించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందన్న టాక్ వినిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement