రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది | oka chinna viramam movie Press Meet | Sakshi
Sakshi News home page

రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది

Published Tue, Feb 4 2020 12:16 AM | Last Updated on Tue, Feb 4 2020 12:16 AM

oka chinna viramam movie Press Meet - Sakshi

సంజయ్‌ వర్మ, గరీమా సింగ్‌

సంజయ్‌ వర్మ, గరీమా సింగ్‌ హీరోహీరోయిన్లుగా సందీప్‌ చేగురి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఒక చిన్న విరామం’. ‘బిగ్‌ బాస్‌’ ఫేమ్‌ పునర్నవి భూపాళం, నవీన్‌ నేని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ – ‘‘థ్రిల్లర్‌ జానర్‌లో రూపొందిన ఈ సినిమా రొటీన్‌ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ఈ సీజన్‌లో రిలీజ్‌ అయ్యే సినిమాల్లో మా సినిమా భిన్నంగా ఉంటుంది’’ అన్నారు సందీప్‌ చేగురి. ‘‘కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నాం’’ అన్నారు పునర్నవి. ఈ సినిమాకు సంగీతం: భరత్‌ మాచిరాజు, కెమెరా: రోహిత్‌ బెచు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement