garima singh
-
రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది
సంజయ్ వర్మ, గరీమా సింగ్ హీరోహీరోయిన్లుగా సందీప్ చేగురి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఒక చిన్న విరామం’. ‘బిగ్ బాస్’ ఫేమ్ పునర్నవి భూపాళం, నవీన్ నేని ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ – ‘‘థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా రొటీన్ సినిమాలకు భిన్నంగా ఉంటుంది. అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘సినిమా బాగా వచ్చింది. ఈ సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాల్లో మా సినిమా భిన్నంగా ఉంటుంది’’ అన్నారు సందీప్ చేగురి. ‘‘కథలో ప్రాధాన్యం ఉన్న పాత్ర చేశాను. మంచి కాన్సెప్ట్‌తో వస్తున్నాం’’ అన్నారు పునర్నవి. ఈ సినిమాకు సంగీతం: భరత్ మాచిరాజు, కెమెరా: రోహిత్ బెచు. -
ప్రేమలో కొత్త కోణ ం
రమేష్ కుర్మాపు, గరిమా సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కైలాసపురం కింగ్స్’. కులదీప్ రాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రౌండ్ ఫండింగ్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ–‘‘ఈ సినిమా చూశాను. వైజాగ్ నేపథ్యంలో జరిగే మాస్ ఎంటర్టైనింగ్ చిత్రమిది’’ అన్నారు. ‘‘మాస్ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది’’ అన్నారు కులదీప్. ‘‘పక్కా మాస్ ఎంటర్టైనర్ ఇది’’ అన్నారు రమేష్. ‘‘ప్రేమలోని కొత్త కోణాన్ని దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు’’ అన్నారు గరిమా సింగ్. ‘‘ఈ సినిమాతో రమేష్‌కి ఇంకా మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్. నిర్మాతలు రిజ్వాన్, తేజ్ వైజాగ్ పాల్గొన్నారు. -
చిన్న విరామం
‘‘ఒక చిన్న విరామం’ సినిమా నా స్టూడెంట్స్‌ది. మా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంలో కొత్తరకమైన, ప్రజలకు అవగాహన కల్పించే, ప్రేక్షకులను ఆకట్టుకునే, ట్రెండ్‌ని సెట్ చేసే సినిమాలు వస్తాయి. ఇప్పుడు ‘అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్, మీడియా’(ఏఐఎస్ఎఫ్ఎం) విద్యార్థులు.. అంటే నా స్టూడెంట్స్ తీసిన సినిమా కాబట్టి పక్కాగా హిట్ అవుతుంది’’ అని ఏఐఎస్ఎఫ్ఎం డైరెక్టర్ అక్కినేని అమల అన్నారు. ఏఐఎస్ఎఫ్ఎం స్టూడెంట్ సందీప్ చేగూరి స్వీయ దర్శకత్వంలో మూన్‌వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించిన ‘ఒక చిన్న విరామం’ సినిమా ఫస్ట్‌లుక్, సాంగ్ ప్రోమోను అమల విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘మా ఫిల్మ్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకు మంచి ప్రతిభ ఉంది. దాంతో అద్భుతమైన చిత్రాలు తీయగలుగుతున్నారు. ‘ఒక చిన్న విరామం’ కచ్చితంగా మంచి హిట్ సాధించి, సందీప్‌కి మరిన్ని అవకాశాలు రావడం ఖాయం’’ అన్నారు. ‘‘నేను తీసే ప్రతి సినిమా ద్వారా 20 నుంచి 25మంది టాలెంటెడ్ యూత్‌ని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నా. యంగ్‌స్టర్స్ అయితేనే బ్లాక్‌బస్టర్స్ ఇవ్వగలరు’’ అన్నారు నిర్మాత రాజ్ కందుకూరి. ‘‘సస్పెన్స్, రోడ్ థ్రిల్లర్‌తో తెరకెక్కిన సినిమా ఇది’’ అన్నారు సందీప్ చేగూరి. ‘‘ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు హీరో సంజయ్‌వర్మ, హీరోయిన్ గరిమాసింగ్. నటులు ధనరాజ్, నవీన్నెవి, కెమెరామన్ రోహిత్ బట్చు, సంగీత దర్శకుడు భరత్ మంచిరాజు, సౌండ్డిజైనర్ అశ్విన్బర్దేలు పాల్గొన్నారు. -
దక్షిణాసియా జూడోలో ‘స్వర్ణాలు’ పండాయి
న్యూఢిల్లీ: దక్షిణాసియా సీనియర్ జూడో చాంపియన్‌షిప్‌లో భారత జూడోకాలు పతకాల పంట పండించారు. నేపాల్‌లోని లలిత్‌పూర్‌లో జరిగిన ఈ పోటీల్లో పది బంగారు పతకాలు గెలిచారు. పాల్గొన్న ఏడుగురు మహిళలూ స్వర్ణాలే గెలుపొందడం విశేషం. ఆరుగురు పురుష జూడోకాల్లో ముగ్గురు పసిడి నెగ్గారు. మహిళల కేటగిరీలో లిక్మాబమ్ సుశీలా దేవి (48 కేజీలు), కల్పనా దేవి (52 కేజీలు), అనితా చాను (57 కేజీలు), హిద్రోమ్ సునిబాలాదేవి (63 కేజీలు), గరిమా చౌదరి (70 కేజీలు), చోంగ్తామ్ జినాదేవి (78 కేజీలు), తులికా మాన్ (78 కేజీలు) స్వర్ణాలు గెలిచారు. పురుషుల విభాగంలో విజయ్ కుమార్ (60 కేజీలు), అజయ్ యాదవ్ (73 కేజీలు), దివేశ్ (81 కేజీలు) పసిడి పతకాలు సాధించారు. అంకిత్ బిష్త్ (66 కేజీలు), జోబన్‌దీప్ సింగ్ (90 కేజీలు), ఉదయ్ వీర్ సింగ్ (100 కేజీలు) కాంస్యాలు నెగ్గారు. గత చాంపియన్‌షిప్ (2014)లోనూ భారత పది బంగారు పతకాలు నెగ్గింది. -
అది ఆమె స్కూల్
ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలు... ఎంతోమంది పేదవారికి విద్యను ప్రసాదించే దేవాలయాలు... ఆ దేవాలయాల పరిస్థితి ఎంత బాగుంటే... విద్యావిధానం కూడా అంతే బాగుంటుంది.... ఇందుకు ప్రభుత్వాలే కాదు అందరూ బాధ్యత తీసుకోవాలి... ఝార్ఖండ్ హజీరాబాఘ్ పట్వాడీ అంగన్వాడీ పరిస్థితి దయనీయంగా ఉంది... ఒక అధికారి దత్తత తీసుకున్నారు... ఇప్పుడు అది అందాలను సంతరించుకుంది... గరిమా సింగ్ ఆలిండియాలో 2015లో యుపిఎస్‌సిలో 55వ ర్యాంకు సాధించారు. అంతకు ముందు ఆమె ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు మహిళల తక్షణ రక్షణ కోసం ఓ రెస్కూ ఫోన్ నంబరును ఏర్పాటు చేశారు. మహిళా రక్షణ టీమ్‌లో తానూ సభ్యులుగా ఉన్నారు. మోహన్‌లాల్‌గంజ్ రేప్ కేసును పరిష్కరించారు. నిజాయితీకి మారుపేరుగా నిలిచే ఆమె ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన మంచి పనులతో తన పరిధిలో ఉన్న మహిళలకు, అణగారిన వర్గాల వారికి రోల్‌మోడల్‌గా నిలిచారు గరిమ సింగ్. గరిమ... ఐపీఎస్ నుంచి ఐఏఎస్‌గా మారారు. కలెక్టరుగా ఆవిడ విధానాలు చాలా కొత్తగా అందరికీ ఉపయోగపడే విధంగా ఉంటాయి. 2016లో కలెక్టరుగా ఆవిడ నిర్వహించిన మొదటి బాధ్యత ఝార్ఖండ్ హజీరాబాఘ్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో అదనపు బాధ్యతలు. ‘‘ఈ బాధ్యత... పిల్లలకు విద్యావకాశాలు మెరుగు పరచడానికి నాకు ఎంతో ఉపయోగపడింది. అది నాకు మరపురాని సంఘటన’’ అని చెబుతారు గరిమ సింగ్. అక్కడి స్థానిక అంగన్వాడీలో పరిస్థితులు హీనంగా ఉండటం చూసి, గరిమ వెంటనే పాఠశాల పునరుద్ధరణకు నడుం బిగించారు. ‘‘విద్యార్థులు తమ తొలి తరగతుల్లో చదువుకున్న అంశాలు వారి మెదడులో నిలిచిపోయేలా ఉండాలి. విద్యా విధానం కూడా అందుకు అనువుగా రూపొందాలి’’ అంటారు గరిమ. మట్వారీ మస్జిద్ రోడ్లో ఉన్న అంగన్వాడీని తాను దత్తత తీసుకున్నారు. ఆ పాఠశాలను అభివృద్ధిచేసి, జిల్లాకే ఆ పాఠశాలను ఆదర్శంగా నిలపాలనుకున్నారు. తాను దాచుకున్న డబ్బులలో నుంచి ఏభై వేల రూపాయలు ఖర్చు చేశారు. బిల్డింVŠ కి రంగులు వేయించి, కొత్తగా తయారుచేశారు. అక్షరమాలను గోడల మీద వేసి, గుమ్మంలోని పెద్ద హోర్డింగ్ పెట్టారు. ప్రీ స్కూల్‌కి అవసరమైన చార్టులు, బ్లాకులు, బొమ్మలు కొని ఇచ్చారు. వీటి ద్వారా పిల్లలు అన్ని విషయాలు బాగా తెలుసుకుంటారంటారు గరిమ. ఊగే గుర్రపు బొమ్మను కూడా ఇచ్చారు. ‘‘ప్రీస్కూల్ పిల్లలకు గుర్రం మీద కూర్చుని ఊగుతూ విద్య నేర్చుకోవడం సరదాగా ఉంటుంది కదా’’ అంటారామె. ‘మట్వారీ కేంద్ర పరిస్థితి అస్సలు బాగాలేదు. చదువుకునే ప్రదేశం ప్రశాంతంగా, అందంగా ఉండకపోతే, పిల్లలు చదవడానికి ఇష్టపడరు. పెద్ద పెద్ద ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు... వంటి వారు అంగన్వాడీలను దత్తత తీసుకుంటే బాగుంటుంది’ అంటారు గరిమ. ఈ సంవత్సరం మార్చినాటికి మొత్తం 50 అంగన్వాడీలను బాగుచేసే పనిలో ఉన్నారు గరిమ. ఇప్పుడు మట్వారీ అంగన్వాడీ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కలెక్టరు చేతుల మీదుగా ప్రారంభోత్సవాని సిద్ధంగా ఉంది. ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు వారి విద్యాభ్యాసం మరపురానిదిగా మిగిలిపోతుంది అంటున్నారు గరిమసింగ్. గరిమ సింగ్ వంటి ఉన్నతాధికారి పూనుకోవడంతో ఒక జిల్లాలోని అంగన్‌వాడీలన్నీ నూతనత్వాన్ని సంతరించుకుంటున్నాయి. మరింతమంది అధికారులు ఇలాగే ముందుకు వస్తే, మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. -
రాజుగారి పెద్ద భార్యదే పైచేయి
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన అమేథి అసెంబ్లీ ఎన్నికల్లో రేపిస్టు మంత్రి గాయత్రి ప్రజాపతిని, తోటికోడలు అమితా సింగ్‌ను కూడా వెనక్కి నెట్టి.. పెద్ద భార్య గరిమాసింగ్ ఆధిక్యంలో ఉన్నారు. అమేథి మహారాజాగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ సింగ్ ఇద్దరు భార్యలే గరిమా సింగ్, అమితా సింగ్. వీళ్లలో అమితాసింగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున అమేథి నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ, తన మంత్రివర్గంలో సభ్యుడైన గాయత్రి ప్రజాపతికి తప్పనిసరి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వాల్సి రావడంతో ఆయన పేరును అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఇక గరిమా సింగ్ బీజేపీ తరఫున పోటీ చేశారు. ఆమె సంజయ్‌సింగ్ నుంచి ఎప్పుడో విడిపోయారు. ఇక అమేథిలో మూడు సార్లు గెలిచిన అమితాసింగ్.. ఓసారి మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్రమోదీ హవాకు తోడు తోటికోడలు కూడా కావడం, మరోవైపు బలమైన మంత్రి గాయత్రి ప్రజాపతి పోటీలో ఉండటంతో ఓట్లు బాగా చీలిపోయాయి. ఒక దశలో గాయత్రి ప్రజాపతి ఆధిక్యంలో ఉన్నా.. ఆ తర్వాత మళ్లీ గరిమాసింగ్ పుంజుకుని ముందుకొచ్చారు. అత్యాచారం కేసులో ఆయనను అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించినప్పటి నుంచి గాయత్రి ప్రజాపతి పరారీలో ఉన్నారు. ఆయన లక్నోలోని తన సొంతింట్లో గానీ, అమేథీలో గానీ ఎక్కడా కనిపించలేదని పోలీసులు చెప్పారు. -
మాజీ భార్య తన భార్యను ఓడిస్తుందని బెంగతో..
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకమైన అమేథి సీటుకు విచిత్ర పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మాజీ భార్య గరిమా సింగ్, ప్రస్తుతం ఉన్న భార్య అమితా సింగ్ మధ్య రసవత్తర పోటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమితా సింగ్ పోటీ చేయగా బీజేపీ తరుపున సంజయ్ సింగ్ మాజీ భార్య గరిమా బరిలోకి దిగింది. తొలుత మాజీ భార్యతో పరోక్షంగా సంప్రదింపులు జరపాలనే యోచన చేసినప్పటికీ ఆ పనిని విరమించుకున్న సంజయ్ సింగ్ తానే స్వయంగా ఎన్నికల ప్రచార భారాన్ని మీద వేసుకున్నారంట. ఎట్టి పరిస్థితుల్లో తన ఇల్లాలిని ఓడిపోనివ్వకూడదని, సరిగ్గా ఆమ్ ఆద్మీ పార్టీ నేతల మాదిరిగానే ప్రతి ఇల్లు తిరిగి తలుపుకొట్టి మరి ప్రచారం చేసి ఓట్లు అడిగారంట. ఓ పక్క మాజీ భార్య, తన ప్రస్తుత భార్య మధ్య రాయల్ కుటుంబానికి చెందిన ఆయన పరిస్థితి చూసి ఓట్లర్లంతా అయ్యోపాపం అనుకున్నారట. ప్రచారంలో ఎంతసేపటికి బీజేపీపైనే విమర్శలు చేసిన ఆయన తన మాజీ భార్యపై దురుసుగా ఒక్క కామెంట్ కూడా చేయలేదని, కేవలం తన ప్రస్తుత భార్యకు ఓటు వేయాలని మాత్రమే కోరారని తెలుస్తోంది. అయితే, ఈ నియోజకవర్గానికి సోమవారం ఎన్నికలు ముగిశాయి. దీంతో ప్రస్తుతం గెలుపు ఓటములపై సమానమైన ఆలోచనను కలిగి ఉన్నారంట. ఎవరు విజయం సాధిస్తారని అనుకుంటున్నారని సంజయ్ సింగ్‌ను ప్రశ్నించగా.. ‘నేను నా వైపు గెలవాలని కోరుకుంటున్నాను.. ఒక వేళ ఏం జరిగినా సరే నన్ను నేను సముదాయించుకుంటాను’ అంటూ ఆయన వేదాంత ధోరణిలో సమాధానం ఇవ్వడం చూసి విలేకర్లు కూడా అహా.. అని అంటున్నారు. సంబంధిత మరిన్ని వార్తా కథనాలకూ చదవండి అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య -
అమేథిలో మొదటి భార్య vs రెండో భార్య
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిష్ఠాత్మకమైన అమేథి సీటుకు రసవత్తర పోటీ జరుగనుంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అమితా సింగ్ పోటీ చేస్తారని ముందుగా రాజకీయవర్గాలు భావించాయి. అయితే ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్–సమాజ్‌వాదీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గాయత్రి ప్రజాపతి పోటీచేస్తారని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. దీంతో తాను తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తానని అమితా సింగ్ ప్రకటించారు. గాయత్రి ప్రజాపతి సిట్టింగ్ సభ్యుడే కాకుండా అఖిలేష్ క్యాబినెట్లో మంత్రి కూడా. ఇక అమితా సింగ్ అమేథి మహారాజాగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకుడు సంజయ్ సింగ్‌కు రెండో భార్య. ఈ పరిస్థితుల్లో బీజేపీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గరిమా సింగ్‌ను ఎంపిక చేసింది. ఆమె సంజయ్ సింగ్ నుంచి విడిపోయిన మొదటి భార్య కావడం విశేషం. అమేథి నుంచి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తానని అమితా సింగ్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అయితే అమేథి, సమీపంలోని రాయ్‌బరేలి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని పదేసి స్థానాలను చెరిసగం పంచుకోవాలని రాహుల్, అఖిలేష్ నిర్ణయించడంతో అమితా సింగ్‌కు అభ్యర్థిత్వం దక్కలేదు. ‘అమేథి నా కుటుంబం, నా ఇల్లు, దీన్ని నేను వదిలిపెట్టలేను. ఈ నియోజకవర్గం అభివృద్ధికి నేను ఎంతో కృషి చేశాను’ అని అమితా సింగ్ తెలిపారు. ఈ విషయంలో పార్టీ సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నానని, ఒకవేళ టిక్కెట్ లభించకపోతే తిరుగుబాటు అభ్యర్థిగానైనా పోటీ చేస్తానని ఆమె ప్రకటించారు. ఈ సీటు నుంచి మూడు సార్లు గెలిచిన ఆమె ఓ సారి మంత్రిగా కూడా పనిచేశారు. తన భర్త మాజీ భార్య అయిన గరిమా సింగ్‌ను అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా బీజేపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. ప్రజలకు ఆమె ఎవరో తెలియదని, వారు కనీసం ఆమెను చూసి కూడా ఉండరని, ప్రజాజీవితంతో ఎలాంటి సంబంధం లేని ఆమెను ఎంపిక చేయడమేమిటని విమర్శించారు.