ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం అనేది ప్రతి నటుడి కల. కనీసం అవార్డు రాకపోయినా ఆ కార్యక్రమానికి వెళ్లి వస్తే చాలని చాలామంది కోరుకుంటారు. అలాంటి ఆస్కార్ పండగకు కరోనా సెగ తగిలింది. ఆస్కార్ చరిత్రలోనే తొలిసారిగా రెండు నెలలపాటు వాయిదా పడింది. కాగా ఫిబ్రవరి 28న 93వ ఆస్కార్ వేడుకలను నిర్వహించాలని అవార్డు కమిటీ ఇదివరకే నిర్ణయించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆలోచన విరమించుకోక తప్పలేదు. (మార్పులకు ఆస్కారం)
కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల చివరిదశలో ఉన్న ఎన్నో సినిమాల షూటింగ్‌లు ఆగిపోగా, మరెన్నో చిత్రాలు విడుదలకు నోచుకోలేదు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అవార్డుల కమిటీ "ద అకాడమీ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్" పురస్కార వేడుకను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 25న పురస్కారాల ప్రధానం ఉంటుందని ప్రకటించింది. ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడే చిత్రాల అర్హత తేదీని సైతం ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. అనంతరం మార్చి 15న నామినేషన్లు వెల్లడిస్తామని తెలిపింది. (వాయిదాకి ఆస్కారం)
Comments
Please login to add a commentAdd a comment