అక్టోబర్ 23న ఆక్సిజన్ ఆడియో | oxygen audio release on october 23rd | Sakshi
Sakshi News home page

అక్టోబర్ 23న ఆక్సిజన్ ఆడియో

Published Sun, Oct 15 2017 12:08 PM | Last Updated on Sun, Oct 15 2017 12:09 PM

Gopichand Oxygen

మ్యాచో హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఏ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'ఆక్సిజన్'. గోపీచంద్ సరసన రాశీఖన్నా, అను ఇమ్యాన్యుయేల్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీసాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాను త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

హై టెక్నిక‌ల్ స్టాండ‌ర్డ్స్ తో క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఆక్సిజన్ సినిమా ఆడియోను ఈ నెల 23న హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు. తమిళ స్టార్ మ్యూజీషియన్ యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీత మందించారు. ముంబై, గోవా, సిక్కిం, చెన్నై త‌దిత‌ర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు మరో విభిన్న పాత్రలో కనిపించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement