ఆ సినిమాకు పాకిస్తాన్ ఓకే! | Pakistan Issues NOC for Screening of Hrithik Roshan's Kaabil | Sakshi
Sakshi News home page

ఆ సినిమాకు పాకిస్తాన్ ఓకే!

Published Fri, Jan 27 2017 11:19 AM | Last Updated on Tue, Sep 5 2017 2:16 AM

ఆ సినిమాకు పాకిస్తాన్ ఓకే!

ఆ సినిమాకు పాకిస్తాన్ ఓకే!

కరాచీ: హృతిక్ రోషన్‌ తాజా చిత్రం ‘కాబిల్’ ప్రదర్శనకు పాకిస్తాన్ పచ్చజెండా ఊపింది. ఈ సినిమాను తమ దేశంలో విడుదల చేసేందుకు పాకిస్తాన్ అనుమతి ఇచ్చింది. ప్రధాని నవాజ్ షరీఫ్ ఏర్పాటు చేసిన కమిటీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌(ఎన్ఓసీ) మంజూరు చేసింది. ఈ వారాంతంలో ‘కాబిల్’  పాకిస్తాన్ లో విడుదలకానుంది. సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో నాలుగు నెలలుగా భారత సినిమాల విడుదలపై పాకిస్తాన్ లో నిషేధం కొనసాగుతోంది.

షారూఖ్‌ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘రాయిస్’ కూడా పాకిస్తాన్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘సెన్సార్ బోర్డు నుంచి ఎన్ ఓసీ కోసం చూస్తున్నాం. అనుమతి వచ్చిన వెంటనే రాయిస్ సినిమాను విడుదల చేస్తామ’ని హమ్ ఫిలిమ్స్ ప్రతినిధి ఒకరు పీటీఐతో చెప్పారు. రాయిస్ సినిమాలో పాక్ నటి మహిరా ఖాన్‌ హీరోయిన్‌ గా నటించింది. పాకిస్తాన్ లో ఈ రెండు సినిమాలు విడుదలైతే మిగతా చిత్రాలకు మార్గం సుగమం అవుతుందని సినీపరిశ్రమలోని వారు అభిప్రాయపడుతున్నారు. రాయిస్, కాబిల్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25న విడుదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement