
‘‘మాది చిత్తూరు. కానీ పెరిగిందంతా బెంగళూరులో. మాది సినిమా ఫ్యామిలీ కాదు. నా డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి సినిమా చాన్సుల కోసం తిరిగాను. దాదాపు ఏడేళ్ల తర్వాత ‘పరిచయం’ చిత్రానికి చాన్స్ వచ్చింది’’ అని హీరో విరాట్ కొండూరు అన్నారు. విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన ‘పరిచయం’ ఈ నెల 21న విడుదలవుతోంది.
విరాట్ మాట్లాడుతూ– ‘‘ఓ యువ జంట మధ్య నడిచే ప్రేమకథ ఇది. కుటుంబ సన్నివేశాలు బాగుంటాయి. మంచి హాస్యభరితమైన సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. రియాజ్‌గారు రాజీపడకుండా నిర్మించారు. మొదటి రోజే రాజీవ్ కనకాలగారితో నటించాను. ఆయన సరదాగా ఉంటారు. పృథ్వీగారు నటన పరంగా ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment