Parichayam Movie
-
రాజుగారు అలా వచ్చారు: ‘డర్టీ హరి’ హీరోయిన్
‘పరిచయం’ సినిమా తర్వాత సినిమాలు చెయ్యకూడదనుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. పైగా చదువు ఆపేసి సినిమాల్లోకి వచ్చాను. చదువా? సినిమాలా? అనే డైలమాలో ఉన్నప్పుడు ‘డర్టీ హరి’ స్క్రిప్ట్‌తో ఎంఎస్ రాజుగారు దేవదూతలా వచ్చారు. స్క్రిప్ట్ కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో చేసిన జాస్మిన్ పాత్ర నాకు బాగా నచ్చింది’ అన్నారు సిమ్రత్ కౌర్. శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ ముఖ్య పాత్రల్లో ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. ఈ సినిమా ఫ్రైడే మూవీస్ ఏటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. సిమ్రత్ కౌర్ మాట్లాడుతూ– ‘నా మొదటి సినిమా ‘ప్రేమతో మీ కార్తీక్’లో ఫ్యామిలీ అమ్మాయిగా కనిపించా. కానీ, ‘డర్టీ హరి’లో నాది కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ పాత్ర. క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చెయ్యాలన్నది నా కల. ఎందుకంటే మా అమ్మానాన్న ఒలింపిక్ ప్లేయర్స్. కరాటేలో నాకు గోల్డ్ మెడల్ ఉంది’ అన్నారు. చదవండి: రాముడు... రావణుడు కాదు! -
‘పరిచయం’ మూవీ రివ్యూ
టైటిల్ : పరిచయం జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్, రాజీవ్ కనకాల, పృథ్వీ, సిజ్జు సంగీతం : శేఖర్ చంద్ర దర్శకత్వం : లక్ష్మీకాంత్ చెన్నా నిర్మాత : రియాజ్ వెండితెర మీద ప్రేమకథలు ఎవర్గ్రీన్. ఏ జానర్ సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా.. సరైన కథా కథనాలతో తెరకెక్కిన ప్రేమకథలు మాత్రం ఎప్పటికీ హిట్ ఫార్ములానే. అందుకే యువ కథనాయకుల అరంగేట్రానికి ప్రేమకథలే ఫస్ట్ ఛాయిస్. అదే బాటలో విరాట్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఎమోషనల్ లవ్ స్టోరి ‘పరిచయం’. లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన ఈ సినిమా సక్సెస్ సాధించిందా..? హీరోగా విరాట్ ఆకట్టుకున్నాడా..? కథ ; ఆనంద్ (విరాట్), లక్ష్మీ (సిమ్రత్ కౌర్) రైల్వేలో ఉద్యోగాలు చేసే సుబ్రమణ్యం (రాజీవ్ కనకాల), సాంబ శివరావు (పృథ్వీ)ల పిల్లలు. ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పుట్టిన వీరిద్దరు చిన్నతనం నుంచి కలిసే పెరుగుతారు. ఒకరంటే ఒకరికి ప్రేమున్న అది చెప్పుకోకుండానే ఏళ్లు గడిచిపోతాయి. చిరవకు ఆనంద్ ధైర్యం చేసి తన ప్రేమ గురించి చెప్పేస్తాడు. కానీ వెంటనే విషయం ఇద్దరి ఇళ్లలో తెలియడంతో గొడవ అవుతుంది. అబ్బాయి అమ్మాయి కలిసి రోడ్డు మీద కనిపించటమే తప్పు అని భావించే సాంబశివరావు తన కూతురే మరో అబ్బాయితో కనిపించే సరికి రగిలిపోతాడు. (సాక్షి రివ్యూస్) కూతుర్ని కొట్టి మరొకరితో పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. దీంతో లక్ష్మీ చనిపోవాలని పురుగుల మందు తాగేస్తుంది. లక్ష్మీ చేసిన పనివల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి..? చిరవకు ఆనంద్, లక్ష్మీలు ఒక్కటయ్యారా..? తల్లిదండ్రులు వారి ప్రేమను అర్థం చేసుకున్నారా..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ ; హైదరాబాద్ నవాబ్స్ లాంటి కామెడీ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మీకాంత్ చెన్నా, విరాట్‌ను హీరోగా పరిచయం చేసేందుకు మాత్రం ఓ ఎమోషనల్ లవ్ స్టోరిని ఎంచుకున్నాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన కథ అని చెప్పినా.. చాలా సన్నివేశాల్లో ఇతర చిత్రాల ఛాయలు కనిపిస్తాయి. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సన్నివేశాల్లో సింహాద్రి, వసంత కోకిల సినిమాల ప్రభావం కనిపిస్తుంది. అయితే బలమైన కథను రాసుకున్న దర్శకుడు అంత ఆసక్తికరంగా తెరమీద చూపించడంలో తడబడ్డాడు. (సాక్షి రివ్యూస్)చాలా సన్నివేశాలను చుట్టేసిన భావన కలుగుతుంది. పురుగుల మందు తాగితే గతం మర్చిపోవటం, కరెంట్ షాక్ కొట్టి తిరిగి గతం గుర్తుకు రావటం లాంటి అంశాలు సిల్లీగా అనిపిస్తాయి. ఎమోషనల్ డ్రామాకు మాటలు ఎంతో కీలకం కానీ పరిచయం సినిమాకు డైలాగ్సే మేజర్ డ్రాబ్యాక్ అయ్యాయి. తొలి సినిమానే ఇంతటి ఎమోషనల్ సినిమాను ఎంచుకోవటం విరాట్ చేసిన సాహసమనే చెప్పాలి. తన పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేసినా.. అక్కడక్కడ అనుభవలేమి బయటపడుతుంది. హీరోయిన్గా నటించిన సిమ్రత్ అందంగా కనిపించింది. నటనపరంగా కూడా ఆకట్టుకుంది. రాజీవ్ కనకాలకు చాలా రోజుల తరువాత మంచి పాత్ర దక్కింది. తనదైన పర్పామెన్స్ తో సుబ్రమణ్యం పాత్రలో జీవించాడు రాజీవ్. పృథ్వీ పాత్ర ఆకట్టుకున్నా.. అక్కడక్కడా కాస్త అతి చేసినట్టుగా అనిపిస్తుంది. (సాక్షి రివ్యూస్)సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ నరేష్ రానా సినిమాటోగ్రఫి. అరుకు అందాలను మరింత అందంగా వెండితెర మీద ఆవిష్కరించారు. పాటలు, లోకేషన్లు ఫ్రెష్ ఫీల్ కలిగిస్తాయి. శేఖర్ చంద్ర సంగీతం బాగుంది. ప్లస్ పాయింట్స్ ; సినిమాటోగ్రఫి లొకేషన్స్ మైనస్ పాయింట్స్ ; డైలాగ్స్ లాజిక్ లేని సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఏడేళ్ల తర్వాత...
‘‘మాది చిత్తూరు. కానీ పెరిగిందంతా బెంగళూరులో. మాది సినిమా ఫ్యామిలీ కాదు. నా డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి సినిమా చాన్సుల కోసం తిరిగాను. దాదాపు ఏడేళ్ల తర్వాత ‘పరిచయం’ చిత్రానికి చాన్స్ వచ్చింది’’ అని హీరో విరాట్ కొండూరు అన్నారు. విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన ‘పరిచయం’ ఈ నెల 21న విడుదలవుతోంది. విరాట్ మాట్లాడుతూ– ‘‘ఓ యువ జంట మధ్య నడిచే ప్రేమకథ ఇది. కుటుంబ సన్నివేశాలు బాగుంటాయి. మంచి హాస్యభరితమైన సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. రియాజ్‌గారు రాజీపడకుండా నిర్మించారు. మొదటి రోజే రాజీవ్ కనకాలగారితో నటించాను. ఆయన సరదాగా ఉంటారు. పృథ్వీగారు నటన పరంగా ఇచ్చిన సలహాలు ఉపయోగపడ్డాయి’’ అన్నారు. -
‘పరిచయం’ మూవీ స్టిల్స్
-
ప్రేమ విలువ తెలిసిన వాళ్లే సినిమాకు రండి
-
‘అమ్మాయిలు షర్ట్ విప్పే సినిమా కాదు’
టాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేది ప్రేమకథలే. ఏ సినిమాను తీసుకున్నా అందులో ప్రేమకథలు ఉండాల్సిందే. ప్రేమకథ చుట్టే తిరిగే సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ మధ్య వచ్చిన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100లు కూడా ఇలాంటివే. కాకపోతే కాస్త కొత్తగా తీశారు. అయితే ఈ వారం విడుదలకు సిద్దంగా ‘పరిచయం’ సినిమా కూడా ప్రేమకథే. ఈ సినిమా ప్రెస్మీట్లో దర్శకుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమించిన వాడు, ప్రేమ విలువ తెలిసిన వాడు మాత్రమే ఈ సినిమాకు రండి. మిగతావారు రానక్కర్లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ప్రేమ అంటే బీచ్, పార్కుల్లో తిరగడం, ముద్దులు పెట్టుకోవడం, షర్ట్లు విప్పడం లాంటివి చూపించే సినిమా కాదని కొన్ని సినిమాలపై సెటైర్లు వేశాడు. పరిచయం ద్వారా సరికొత్తగా ఉండే ప్రేమకథను పరిచయం చేస్తానని ధైర్యంగా చెప్పాడు. మరి ఈ దర్శకుడి మాటలు నిజమో కాదో జూలై 21న తెలుస్తుంది. ఈ సినిమాలో విరాట్, సిమ్రాట్ కౌర్‌లు జంటగా నటిస్తున్నారు.