
టాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేది ప్రేమకథలే. ఏ సినిమాను తీసుకున్నా అందులో ప్రేమకథలు ఉండాల్సిందే. ప్రేమకథ చుట్టే తిరిగే సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ మధ్య వచ్చిన అర్జున్ రెడ్డి, ఆర్‌ఎక్స్ 100లు కూడా ఇలాంటివే. కాకపోతే కాస్త కొత్తగా తీశారు. అయితే ఈ వారం విడుదలకు సిద్దంగా ‘పరిచయం’ సినిమా కూడా ప్రేమకథే.
ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో దర్శకుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమించిన వాడు, ప్రేమ విలువ తెలిసిన వాడు మాత్రమే ఈ సినిమాకు రండి. మిగతావారు రానక్కర్లేదంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేశాడు. ప్రేమ అంటే బీచ్, పార్కుల్లో తిరగడం, ముద్దులు పెట్టుకోవడం, షర్ట్‌లు విప్పడం లాంటివి చూపించే సినిమా కాదని కొన్ని సినిమాలపై సెటైర్లు వేశాడు. పరిచయం ద్వారా సరికొత్తగా ఉండే ప్రేమకథను పరిచయం చేస్తానని ధైర్యంగా చెప్పాడు. మరి ఈ దర్శకుడి మాటలు నిజమో కాదో జూలై 21న తెలుస్తుంది. ఈ సినిమాలో విరాట్, సిమ్రాట్ కౌర్‌లు జంటగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment