simrat
-
ఎవరూ చెడ్డ కాదు
‘ఈ ప్రపంచంలో ఎవరూ చెడ్డ కాదు.. ఎవరూ మంచి కాదు. పరిస్థితుల ప్రభావంతోనే మంచివాళ్లుగా, చెడ్డవాళ్లుగా మారతారు’ అనే సిద్ధాంతాన్ని ఆధారం చేసుకుని సుమంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. నితిన్, నాని, నిఖిల్ వంటి హీరోలతో పలు హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు తన మిత్రుడు పి.జగన్మోహన్ రావుతో కలిసి ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంతో సంతోష్ కుమార్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. సంజన ప్రొడక్షన్స్– సాయికృష్ణా ప్రొడక్షన్స్ పతాకాలపై ఈ సినిమా తెరకెక్కనుంది. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందనున్న చిత్రమిది. సుమంత్ సరసన సిమ్రత్ కథానాయికగా నటించనుంది. సుమంత్‌ను కొత్త కోణంలో, సరికొత్త గెటప్‌లో చూపించే ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళుతుంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని దర్శక–నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యాజమాన్య, కెమెరా: అష్కర్. -
‘అమ్మాయిలు షర్ట్ విప్పే సినిమా కాదు’
టాలీవుడ్ చిత్రాల్లో ఎక్కువగా కనిపించేది ప్రేమకథలే. ఏ సినిమాను తీసుకున్నా అందులో ప్రేమకథలు ఉండాల్సిందే. ప్రేమకథ చుట్టే తిరిగే సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ మధ్య వచ్చిన అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100లు కూడా ఇలాంటివే. కాకపోతే కాస్త కొత్తగా తీశారు. అయితే ఈ వారం విడుదలకు సిద్దంగా ‘పరిచయం’ సినిమా కూడా ప్రేమకథే. ఈ సినిమా ప్రెస్మీట్లో దర్శకుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. జీవితంలో ప్రేమించిన వాడు, ప్రేమ విలువ తెలిసిన వాడు మాత్రమే ఈ సినిమాకు రండి. మిగతావారు రానక్కర్లేదంటూ స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ప్రేమ అంటే బీచ్, పార్కుల్లో తిరగడం, ముద్దులు పెట్టుకోవడం, షర్ట్లు విప్పడం లాంటివి చూపించే సినిమా కాదని కొన్ని సినిమాలపై సెటైర్లు వేశాడు. పరిచయం ద్వారా సరికొత్తగా ఉండే ప్రేమకథను పరిచయం చేస్తానని ధైర్యంగా చెప్పాడు. మరి ఈ దర్శకుడి మాటలు నిజమో కాదో జూలై 21న తెలుస్తుంది. ఈ సినిమాలో విరాట్, సిమ్రాట్ కౌర్‌లు జంటగా నటిస్తున్నారు. -
‘పరిచయం’ ఫస్ట్ డే చూస్తా
‘‘పరిచయం’ టైటిల్ బాగుంది. టీమ్ వర్క్‌తో సినిమాను కంప్లీట్ చేశారు. పృథ్వీ(పెళ్లి ఫేమ్)ఎనర్జిటిక్ ఆర్టిస్ట్. ఈ సినిమాను ఫస్ట్‌డే చూస్తా. ఫీల్ గుడ్ లవ్‌స్టోరీతో రానున్న ఈ సినిమా విజయం సాధించాలి. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ మారుతి అన్నారు. విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ జంటగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రియాజ్ నిర్మించిన ‘పరిచయం’ ఈ నెల 21న విడుదల కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను మారుతి విడుదల చేశారు. దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా మాట్లాడుతూ– ‘‘లవ్, ఎంటర్టైన్మెంట్తో తెరకెక్కిన చిత్రమిది. స్ట్రాంగ్ ఎమోషన్ కూడా ఉంటుంది. మా సినిమాను సపోర్ట్ చేసేందుకు పెద్ద మనసుతో ముందుకు వచ్చిన నాని, శర్వానంద్, సాయిపల్లవి, హరీష్ శంకర్, మారుతిగార్లకు రుణపడి ఉంటాను’’ అన్నారు. ‘‘దాదాపు 8ఏళ్లుగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా. ఈ సినిమాతో నా కల నేరవేరింది. తొలి అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు విరాట్. ‘‘ఏడేళ్ల తర్వాత నేను తెలుగులో నటించిన సినిమా ఇది’’ అన్నారు పృథ్వీ. ‘‘మంచి సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టినందుకు ఆనందంగా ఉంది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ సహకారం మరవలేనిది’’ అన్నారు రియాజ్. -
స్టార్ట్ కెమెరా అనలేకపోయా– గొల్లపూడి మారుతీరావు
‘‘యాభై మూడేళ్ల కిందట మంచి కథ, సినిమాకి మేం ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. డబ్బులొస్తాయా? రావా అనే ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు సినిమా సక్సెస్ అవుతుందా? డబ్బులొస్తాయా? రావా? అనే వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అన్నారు నటులు గొల్లపూడి మారుతీరావు. కార్తికేయ, సిమ్రత్ జంటగా రిషి దర్శకత్వంలో రవీందర్ ఆర్. గుమ్మకొండ నిర్మించిన ‘ప్రేమతో మీ కార్తీక్’లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా గొల్లపూడి మాట్లాడారు. ‘‘నేను రెగ్యులర్‌గానే సినిమాలు చేస్తున్నా. కాకపోతే నా వయసుకి తగ్గట్టు ఎక్కువ సినిమాలు చేయడం లేదంతే. ప్రస్తుత సినిమాల్లో నాకు తగ్గ పాత్ర ఉంటేనే అవకాశం ఇస్తున్నారు. ‘ఈ మధ్య కాలంలో కథలు చెప్పకపోయినా ఫర్వాలేదులే’ అనేంత మంచి సినిమాలొస్తున్నాయి. అంటే విమర్శించడం లేదు. ప్రేక్షకులకు ఏం చూపిస్తే హ్యాపీగా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. ‘ప్రేమతో మీ కార్తీక్’ మూడు తరాలకు చెందిన చక్కని కుటుంబ కథా చిత్రమిది. అమెరికాలో ఎంతో సంపాదించిన హీరో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. అతనేం చేశాడన్నది ఆసక్తికరం. కొత్త దర్శకులు, నిర్మాతలు వచ్చినప్పుడు సరికొత్త ఆలోచనలు, కొత్త సినిమాలొస్తాయి. డిజిటల్ రంగాన్ని నేటి తరం బాగా వినియోగించుకుంటున్నారు. 50 ఏళ్ల క్రితం ‘బాహుబలి’ని ఊహించలేం’’ అన్నారు. నా దర్శకత్వం ఓ గొప్ప విషాదానికి గుర్తు సక్సెస్ఫుల్ రైటర్ అయిన మీరు ఎందుకు దర్శకత్వం చేయలేదు? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘నా జీవితంలో దర్శకత్వం అన్నది ఓ గొప్ప విషాదానికి గుర్తు. మా అబ్బాయి ఓ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ప్రమాదవశాత్తు 9వ రోజే చనిపోయాడు. ఆ సమయంలో ఆ సినిమా దర్శకత్వ బాధ్యతలు నేను చేపట్టి ఫస్ట్ టైమ్ ‘స్టార్ట్ కెమెరా’ అన్నాను. ఆర్నెల్లకు షూటింగ్ పూర్తయింది. చివరిరోజు షూటింగ్లో ‘స్టార్ట్ కెమెరా’ అనలేకపోయా. కారణం కొడుకు చనిపోయాడనే బాధ. అప్పటి నుంచి దర్శకత్వం ఆలోచనే లేదు’’ అన్నారు. ఈ చిత్రానికి లైన్ ప్రొడ్యూసర్ అశోక్‌రెడ్డి గుమ్మడికొండ, సంగీతం: షాన్ రెహమాన్, సమర్పణ: రమణ శ్రీ గుమ్మకొండ, గీతా మన్నం. -
‘ప్రేమతో మీ కార్తీక్’ మూవీ స్టిల్స్