
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ వదిలేసిన బ్యాడ్మింటన్ రాకెట్‌ను మరో బ్యూటీ పరిణీతీ చోప్రా అందుకున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైనా’. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. ముందుగా సైనా నెహ్వాల్ పాత్రకు శ్రద్ధా కపూర్‌ను తీసుకున్నారు. కొంత షూటింగ్ కూడా జరిగింది. ఇప్పుడు అకస్మాత్తుగా టైటిల్ రోల్‌లో పరిణీతీ చోప్రా నటించనున్నారని చిత్రబృందం వెల్లడించింది.
‘‘చిచోరే, స్ట్రీట్ డ్యాన్సర్ 3, భాఘీ 3, సాహో’ చిత్రాలతో శ్రద్ధాకపూర్ చాలా బిజీగా ఉన్నారు. ‘సైనా’ చిత్రాన్ని ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేసి 2020లో విడుదల చేయాలనుకుంటున్నాం. మా ప్లాన్‌కి తగ్గట్టుగా శ్రద్ధా డేట్స్ కుదిరేట్లు లేవు. అందుకే ఆమె స్థానంలో పరిణీతీ చోప్రాను తీసుకున్నాం. ఈ మార్పు పరస్పర అంగీకారం ప్రకారం జరిగింది. ఈ సినిమా స్క్రిప్ట్ పరిణీతీకి బాగా నచ్చింది. త్వరలోనే ఆమె బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తారు’’ అని చిత్రబృందం వెల్లడించింది.