సుప్రీమ్లో 'పటాస్' బ్యూటీ | pataas girl Shruthi Sodhi to sizzle in a special song | Sakshi
Sakshi News home page

సుప్రీమ్లో 'పటాస్' బ్యూటీ

Published Sat, Jan 30 2016 3:25 PM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

సుప్రీమ్లో 'పటాస్' బ్యూటీ - Sakshi

సుప్రీమ్లో 'పటాస్' బ్యూటీ

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా పటాస్. అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా ఎంటర్టైనర్తో శృతి సోథి హీరోయిన్గా పరిచయం అయింది. పెద్దగా పర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశం లేకపోయినా, ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తరువాత పెద్దగా ఆఫర్స్ రాకపోవటంతో టాలీవుడ్కి దూరంగా ఉంది శృతి.

త్వరలోనే మరోసారి ఈమె తెలుగు వెండితెర మీద సందడి చేయనుందట. హీరోయిన్గా ఒక్క సినిమా మాత్రమే చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు ఐటమ్ సాంగ్తో తెలుగు ఆడియన్స్ను పలకరించబోతోంది. పటాస్తో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చిన అనీల్, తన రెండో సినిమా సుప్రీంలోనూ శృతి సోథిని కంటిన్యూ చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఓ చిన్న పాత్రతో పాటు స్పెషల్ సాంగ్లోనూ ఆడిపాడనుంది ఈ బ్యూటీ. మరి ఈ గెస్ట్ రోల్ అయినా శృతిసోథికి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement