సరికొత్త లుక్లో పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన కల్యాణ్ సరికొత్త లుక్లో దర్శనమివ్వనున్నారు. పవన్ అతిథి పాత్రలో నటిస్తున్న'గోపాల గోపాల' సినిమా కోసం బరువు తగ్గినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందుకోసం పవన్ పాలు, పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకున్నట్టు చెప్పారు. 'పవన్ బరువు తగ్గడాన్ని చాలెంజ్గా తీసుకున్నారు. పాలు, పండ్లు మాత్రమే తీసుకునేవారు. పిండి, ఆయిల్ పదార్థాలను మానేశారు. పవన్ స్లిమ్గా అవడం చూసి సెట్స్పై అందరూ ఆశ్చర్యపోయారు' అని ఈ చిత్ర సంబంధిత వర్గాలు తెలిపాయి.
బాలీవుడ్ చిత్రం ఓ మైగాడ్ను తెలుగులో గోపాల గోపాలగా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో వెంకటేశ్, శ్రియ నటిస్తుండగా, పవన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. పవన్ అభిమానుల కోసం ఈ చిత్రంలో ఆయనపై పాటను చిత్రీకరించారు. వెంకటేశ్తో కలసి పవన్ డ్యాన్స్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.