
ఇటీవల ఘన విజయం సాధించిన ఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. తొలి సినిమా తోనే భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ భామ త్వరలో ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సాక్ష్యం సినిమాతో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాయల్ స్పెషల్ సాంగ్ చేసేందుకు అంగీకరించారు.
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో యూత్‌లో పాయల్ రాజ్‌పుత్‌కు మంచి క్రేజ్ వచ్చింది. అందుకే బెల్లంకొండ సినిమాలో పాయల్ స్పెషల్ సాంగ్‌లో నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు చిత్రయూనిట్. గతంలో సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన సినిమాల్లో తమన్నా, కేథరిన్ థ్రెస్సాలు స్పెషల్ సాంగ్స్‌లో తళుక్కుమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment