సాక్షి, చెన్నై: దెయ్యం అంటే ఏమిటి? అసలు దెయ్యం ఉందా? లేదా? ఇలాంటి సందేహాలు ఇప్పటికీ చాలా మందికి కలిగేవే. అలాంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలంటే 'పేయ్ ఇరుక్కా ఇల్లైయా' చిత్రం చూడాలంటున్నారు చిత్ర దర్శక, నిర్మాత పా.రంజిత్‌కుమార్. స్వయంగా కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ఇది. అమర్ హీరోగానూ, జ్యోతిషా హీరోయిన్‌గానూ నటిస్తున్న ఇందులో విజయకుమార్, లీవింగ్‌స్టర్‌లతో పాటు పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలను పోషించారు.
నలుగురు పనిలేని కుర్రాళ్లు, క్రైం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు రంజిత్‌కుమార్ తెలిపారు. అసలు దెయ్యాలు ఉన్నాయా? ఉంటే అవి దుష్ట శక్తులా? లేక మనిషి మరణించిన తరువాత ఆత్మలుగా మారతారా? ఇలాంటి ప్రశ్నలకు బదులిచ్చేలా ఈచిత్రం ఉంటుందన్నారు. చిత్రాన్ని చెన్నై, అలంగనల్లూర్, తూత్తుకుడి తదితర ప్రాంతాలలో చిత్రీకరించినట్లు దర్శకుడు తెలిపారు. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈచిత్రానికి టీ.మహీబాలన్ ఫొటోగ్రఫీ, ఆర్ సంపత్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment