
సాక్షి, సినిమా : గత నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో ఆమె ఒక ట్రెండింగ్. తన కొంటె చూపులతో కుర్రకారు మనసులను అమాంతం దోచేసింది. తనే ప్రియా ప్రకాశ్ వారియర్. కేరళకు చెందిన ఈ అమ్మడు ఒక్క టీజర్‌తోనే వార్తల్లో నిలిచింది. తన కనుసైగలతో యువతను కట్టిపడేసింది. లక్షలాది మంది యువతీ యువకులు ఈ వీడియోను తమ వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకున్నారంటే అతిశయోక్తి కాదు.
అయితే ఈ బ్యూటీపై హైదరాబాద్‌లో పోలీస్ కేసు నమోదైంది. ఫరూక్ నగర్‌కు చెందిన కొంత మంది యువకులు ఫలక్‌నుమా స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీసే విధంగా పాట చిత్రీకరణ జరిగిందని, ప్రియా ప్రకాశ్‌తో పాటు చిత్ర నిర్మాత, దర్శకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వారు తమ లిఖితపూర్వక ఫిర్యాదులో పేర్కొన్నారు.
‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాతో ప్రియాప్రకాశ్ వారియర్ అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కనుసైగలతో, కన్నుగీటుతూ యువకుడిని ప్రేమమైకంలో ముంచెత్తే ప్రియాప్రకాశ్ వీడియో ఇప్పటికే సెన్సేషనల్ అయింది. ఈ ఒక్క వీడియోతో ఓవర్‌నైట్ ఆమె నేషనల్ స్టార్ అయిపోయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మిలియన్‌కుపైగా ఫాలోవర్లు యాడ్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment