
ముంబై: టాలీవుడ్‌లో ఫుల్ సక్సెస్ జోష్‌లో ఉన్నారు నటి పూజా హెగ్డే. ఇటీవల ఆమె నటించిన ‘అల వైకుంఠపురములో’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్‌గా నిలవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస పెట్టి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోలందరితో నటిస్తూ మోస్ట్ బిజీ హీరోయిన్ అయ్యారు. తెలుగులో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ప్రభాస్ 20వ సినిమాలో నటిస్తున్న పూజా.. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌తో ‘మొహంజోదారో’.. అక్షయ్ కుమార్‌తో ‘హౌస్‌ఫుల్-4’లో నటించిన ఈ భామ సల్మాన్‌తో జతకట్టి మరోసారి బీ-టౌన్‌లో అదృష్టాన్ని పరిశీలించుకోనున్నారు. (బ్యాచ్‌లర్ వచ్చేశాడు)
సల్మాన్ ఖాన్ హీరోగా ఫర్హద్ సంజీ తెరకెక్కిస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. 2021 ఈద్ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాకు పూజా అయితేనే సరిగ్గా సరిపోతుందని ఆలోచించిన తర్వాతే ఆమెను ఎంచుకున్నట్లు నిర్మాత ఫర్హాద్ సంజీ తెలిపారు. సల్మాన్ ప్రస్తుతం రాధే సినిమా చేస్తున్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్. (సల్లూభాయ్ కాస్త రెస్ట్ తీసుకో..)
Comments
Please login to add a commentAdd a comment