
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన మహర్షి సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డివైడ్ వచ్చినా ఈ సినిమా వసూళ్లు పరంగా మాత్రం సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. ఈసందర్భంగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మహేష్ తో పాటు అల్లరి నరేష్, ఇతర నటీనటులు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్‌లు, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ.. దర్శకుడు వంశీ పైడిపల్లి టేకింగ్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందంటూ కితాబిచ్చారు. నేనే గనక ఆడపిల్లనైతే మహేష్ బాబు పెళ్లి చేసుకునే వరకు వదిలిపెట్టే వాడిని కాదంటూ నవ్వులు పూయించారు. మహేష్ అందం చూస్తే మొగాళ్లకు అసూయ కలుగుతుందంటూ ఆకాశానికెత్తేశారు. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.