ఇది ప్రేమ విజయం! | Positive Talk is Powerful Than Everything Else | Sakshi
Sakshi News home page

ఇది ప్రేమ విజయం!

Published Wed, Feb 11 2015 10:54 PM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

ఇది ప్రేమ విజయం!

ఇది ప్రేమ విజయం!

‘‘ఒక సినిమా విజయం సాధిస్తే, అది పరిశ్రమకు ఎంత ఉపయోగమో నాకు బాగా తెలుసు. ఆ పరంగా ఈ సినిమా పరిశ్రమకు ఉపయోగపడింది. అన్ని కోణాల్లోనూ సినిమా బాగుంది. కొన్ని సన్నివేశాలకు నా మనసు స్పందించింది. అలా చాలా అరుదుగా జరుగుతుంది’’ అని ‘ప్రసాద్’ సంస్థల అధినేత రమేశ్ ప్రసాద్ అన్నారు. శర్వానంద్, నిత్యామీనన్ జంటగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె. వల్లభ సమర్పణలో కేయస్ రామారావు నిర్మించిన  ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ గత వారం విడుదలైంది.

బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విజయోత్సవ సభలో సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ - ‘‘ఫైట్లు, ఐటమ్ సాంగ్స్ లేకపోతే ప్రేక్షకులు సినిమాలు చూడరనే మాట విన్నప్పుడల్లా, ప్రేక్షకులను తక్కువ చేస్తున్నారేమోనని బాధపడిపోయేవాణ్ణి. కరెక్ట్ సినిమా తీస్తే, ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఈ చిత్రం నిదర్శనం’’ అన్నారు. ఏ ఆర్టిస్ట్ అయినా అద్భుతంగా నటించాలంటే మంచి సన్నివేశాలు, సంభాషణలు అవసరమనీ, ఈ చిత్రంలో ఆ రెండూ ఉన్నాయని నిత్యామీనన్ అన్నారు. మంచి చిత్రంలో నటించినందుకు సంతృప్తిగా ఉందని శర్వానంద్ చెప్పారు. కథను నమ్మి సినిమా చేశామనీ, ఇది ప్రేమ విజయం అని దర్శకుడు తెలిపారు. ఈ విజయం ద్వారా మరిన్ని అద్భుతమైన చిత్రాలు నిర్మించే ప్రోత్సాహాన్ని ప్రేక్షకులు ఇచ్చారని వల్లభ అన్నారు. గోపీసుందర్, జ్ఞానశేఖర్, పావని, కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement