
రకుల్‌ప్రీత్ సింగ్, సూర్య
కోలీవుడ్‌లో దాదాపు 48రోజుల పాటు సాగిన థియేటర్స్ బంద్‌కి ఫుల్‌స్టాప్ పడటంతో సినిమాల సందడి డబుల్ ఫోర్స్‌తో స్టార్ట్ అయింది. మూవీ రిలీజ్‌లు, షూటింగ్‌లు, ఆడియో ఫంక్షన్‌లతో తమిళ ఇండస్ట్రీకి మళ్లీ పూర్వవైభవం వచ్చింది. సూర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎన్‌జీకే’ సినిమా శనివారం ప్రారంభమైంది. సాయి పల్లవి, రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికలు. ‘ఎన్‌జీకే’ షూటింగ్‌లో రకుల్ జాయిన్ అయ్యారు. ఈ షెడ్యూల్‌లో సూర్య, రకుల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఆ సంగతి అలా ఉంచితే.. రకుల్ ప్రీత్‌సింగ్ లవ్‌లో ఉన్నారని ఒప్పుకున్నారు. ఇంతకీ ఎవరా అదృష్టవంతుడు? అనేగా మీ డౌట్. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఆమె లవ్‌లో పడింది పర్సన్‌తో కాదు. యాక్టింగ్ ప్రొఫెషన్‌తో అన్నమాట. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఎంతగానో లవ్ చేస్తున్నానని చెప్పారు. అయితే.. ‘స్పైడర్’ సినిమా తర్వాత రకుల్ నటించనున్న తెలుగు చిత్రంపై క్లారిటీ లేదు. మూడు తమిళ్, ఒక హిందీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారామె.
Comments
Please login to add a commentAdd a comment