
విత్ లవ్ ప్రభాస్!
... అంటూ ‘బాహుబలి’లో తాను వాడిన కత్తిని పోలిన కత్తిని తయారు చేయించి విరాట్‌కు బహుమతిగా పంపించారు ప్రభాస్. ఎవరీ విరాట్ అనుకుంటున్నారా? దివంగత నటుడు శివాజీ గణేశన్ ముని మనవడు. అంటే.. శివాజీ తనయుడు ప్రభు కొడుకు విక్రమ్ ప్రభు కుమారుడు విరాట్ అన్నమాట. ఈ బుడతడు ‘బాహుబలి’ సినిమా చూశాడు. అప్పటి నుంచి ప్రభాస్‌కి వీరాభిమాని అయ్యాడు.
ఈ విషయాన్ని విక్రమ్ ప్రభు ద్వారా తెలుసుకున్న ప్రభాస్... తన చిన్ని ఫ్యాన్‌ని సర్‌ప్రైజ్ చేయాలనుకున్నారు. ‘బాహుబలి’లో తాను వాడిన ఖడ్గాన్ని పోలిన ఖడ్గాన్ని తయారు చేయించి, దాని మీద ‘ఫర్ విరాట్... విత్ లవ్ ప్రభాస్’ అని రాసి పంపించారు. ఈ విషయాన్ని విక్రమ్‌ప్రభు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిమానులతో పంచుకుని, ఫొటో షేర్ చేశారు. ‘ఇది ఒక స్వీటెస్ట్ పర్సన్ నుంచి అందిన కానుక. థ్యాంక్యూ ప్రభాస్. యు ఆర్ గ్రేట్’ అని ప్రభాస్‌కు విక్రమ్‌ప్రభు ధన్యవాదాలు తెలియజేశారు.