ప్రభు, ఊర్వశిల కామెడీ గలాటా
ప్రభు, ఊర్వశిల కామెడీ గలాటా
Published Fri, Mar 25 2016 3:41 AM | Last Updated on Fri, Aug 17 2018 2:34 PM
ప్రముఖ నటుడు ప్రభు నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నవరసాలను ఏకకాలంలో నటించగల దిట్ట ఆయన. అలాంటి నటుడు తాజాగా నటిస్తున్న చిత్రాల్లో ఉన్నోడు కా చిత్రం ఒకటి. ఇందులో ఆయన నటి ఊర్వశితో కలిసి వినోదాల విందు చేయనున్నారు. అభిరామి మెగామాల్ పతాకంపై అభిరామి రామనాథన్ నిర్మిస్తున్న చిత్రం ఉన్నోడు కా. ఈ చిత్రం గురించి ప్రభు తనదైన స్టైల్‌లో చెబుతూ చాలా కాలం తరువాత పూర్తి హాస్యభరిత కథా చిత్రంలో నటిస్తున్నాను.
ఈ చిత్రంలో తాను రెండు వైవిధ్యభరిత గెటప్‌లలో కనిపించనున్నాను. చేతిలో కత్తి పట్టి గ్రామీణ గెటప్ ఒకటి కాగా నగరంలో కొడుకు ప్రేమకు సాయం చేసే పాశం ఉన్న తండ్రిగా మరో గెటప్‌లోనూ నటిస్తున్నాను. ఇందులో తనకు జంటగా నటి ఊర్వశి నటిస్తున్నారు. మేమిద్దరం కలిస్తే వినోదాల విందే. ఈ చిత్రానికి అభిరామీ రామనాథన్ కథను రాశారు. కథ వినగానే నటించాలని నిర్ణయించుకున్నాను. కారణం ఇలాంటి వినోదాత్మక కథలు అరుదుగా లభిస్తుంటాయి.
ఈ రోజుల్లో కుటంబ సమేతంగా కలసి చూసి ఆనందించే కథా చిత్రాలు రావడం తక్కువనే చెప్పాలి. ఆ కొరతను ఈ ఉన్నోడు కా చిత్రం తీరుస్తుంది. ప్రేమ,హాస్యం,సెంటిమెంట్,యాక్షన్ అంటూ జనరంజకమైన అంశాలు పుష్కరంగా ఉన్న చిత్రం ఇది.అంతే కాదు చక్కని సందేశం కూడా ఉంటుంది. యువ జంటగా ఆరి,మాయ నటిస్తున్నారు.నేను ఇప్పటికి 60కి పైగా కొత్త దర్శకులతో పని చేశాను. ఆ కోవలోకి ఈ చిత్రం దర్శకుడు ఆర్‌కే చేరతారు. దీనికి సత్య సంగీతాన్ని అందిస్తున్నారు అని ప్రభు ఉన్నోడు కా చిత్ర వివరాలను తెలిపారు.
Advertisement
Advertisement