
మణితో మూడో సారి
దర్శకుల్లో మణిరత్నం స్థానం ఏమిటన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈ మధ్య ఆయన టైమ్ అస్సలు బాగోలేదనే చెప్పాలి. నిజం చెప్పాలంటే మణిరత్నం మంచి విజయాన్ని
దర్శకుల్లో మణిరత్నం స్థానం ఏమిటన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే ఈ మధ్య ఆయన టైమ్ అస్సలు బాగోలేదనే చెప్పాలి. నిజం చెప్పాలంటే మణిరత్నం మంచి విజయాన్ని చూసి కొన్నేళ్లు అయ్యింది. కడల్ చిత్రం తరువాత ఆయన చేసిన భారీ ప్రయత్నాలు ఫలించలేదు. ఎట్టకేలకు తాజా చిత్రానికి ముహూర్తం కుదిరింది. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి తనయుడు సల్మాన్ దుల్కర్ హీరోగాను, నటి నిత్యామీనన్ హీరోయిన్‌గాను ఎంపిక చేసిన మణిరత్నం చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. ఇదో వైవిధ్యభరిత పూర్తి ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్నట్లు సమాచారం.
చిత్రం శుక్రవారం సెట్‌పైకి వెళ్లనుంది. మరో విషయం ఏమిటంటే నటుడు ప్రకాష్‌రాజ్ ఈ చిత్రంలో ముఖ్యభూమికను పోషించనున్నారు. మణిరత్నం దర్శకత్వంలో ఈయన నటించనున్న మూడో చిత్రం ఇది. ఇంతకుముందు ఇరువర్, కన్నత్తిల్ ముత్తుమిట్టాల్ చిత్రాల్లో ప్రకాష్‌రాజ్ ప్రధానపాత్రలు పోషించారు. దీని గురించి ప్రకాష్‌రాజ్ తన ట్విట్టర్‌లో పేర్కొంటూ మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించనుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. స్క్రిప్ట్ చాలా బాగుంది మణిరత్నం నెరేట్ చేయగానే చాలా గొప్పగా ఫీలయ్యానని అన్నారు. అయితే ఈ చిత్రం గురించి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ వివరాలు చెప్పలేనని ప్రకాష్‌రాజ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గతంలో మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన మౌనరాగం చిత్రం రీమేక్ అని ప్రచారం జరగడం విశేషం.