తొడరి విడుదలకు సన్నాహాలు | Preparations to launch todari | Sakshi
Sakshi News home page

తొడరి విడుదలకు సన్నాహాలు

Published Mon, Jul 25 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM

తొడరి విడుదలకు సన్నాహాలు

తొడరి విడుదలకు సన్నాహాలు

మామ చిత్రం హంగామా తగ్గుముఖం పట్టిన తరువాత అల్లుడి చిత్రం హడావుడి మొదలవనుంది. అర్థం అయిందాని అడగాల్సిన అవసరం లేదనుకుంటా ‘రజనీకాంత్ చిత్రం కబాలి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో వసూళ్ల పరంగా దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. తదుపరి ఆయన అల్లుడు ధనుష్ నటించిన తొడరి చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తంగమగన్ చిత్రం తరువాత ధనుష్ నటించిన చిత్రం ఏదీ తెరపైకి రాలేదు. అయితే ఆయన నటిస్తున్న మూడు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వాటిలో తొడరి, కొడి చిత్రాల నిర్మాణ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. వీటిలో ధనుష్ మొదట నటించింది తొడరి చిత్రంలో. అయితే గ్రాఫిక్స్, సీజీ కార్యక్రమాలు కారణంగా తొడరి చిత్ర నిర్మాణం కాస్త ఆలస్యమైందని సమాచారం. అయినా ముందు నటించడానికి అంగీకరించిన తొడరి చిత్రాన్నే ముందుగా విడుదల చేయాలని ధనుష్ వర్గం నిర్ణయించినట్లు తెలిసింది.


నటి కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మించింది. ప్రభుసాల్మన్ దర్శకుడు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఇటీవల విడుదలైంది. అయితే రజనీకాంత్ చిత్రం కబాలి విడుదల తరువాత తొడరి చిత్రాన్ని తెరపైకి తీసుకురావాలని చిత్ర వర్గాలు భావించినట్లు సమాచారం. కబాలి ఇటీవల తెరపైకి వచ్చింది కాబట్టి తొడరి చిత్రాన్ని స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 12న విడుదలకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది రైలులో జరిగే ప్రేమకథా చిత్రం అన్న విషయం తెలిసిందే. ఇందులో ధనుష్ క్యాంటీన్‌బాయ్‌గా నటించారు. ఆ రైల్లో ప్రయాణిస్తున్న కీర్తీసురేశ్‌తో పరిచయం ప్రేమగా మారడం, ఆ ప్రేమ ఏ తీరం చేరిందన్నదే తొడరి చిత్ర ఇతివృత్తం. ఇది ధనుష్, ప్రభుసాల్మన్‌ల చిత్రం కనుక మంచి అంచనాలే నెలకొంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కరేదు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement