నా ప్రేమ మొత్తాన్నీ ఇచ్చేశా! | present my focus on cinemas says tamanna | Sakshi
Sakshi News home page

నా ప్రేమ మొత్తాన్నీ ఇచ్చేశా!

Published Mon, May 11 2015 11:23 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

నా ప్రేమ మొత్తాన్నీ ఇచ్చేశా! - Sakshi

నా ప్రేమ మొత్తాన్నీ ఇచ్చేశా!

‘‘నాతో ఇంటర్వ్యూ అనగానే.. ముందు నేను చేసే సినిమాల గురించి అడుగుతారు. ఆ తర్వాత రెండు ప్రశ్నలు అడుగుతుంటారు. ఒకటి ‘మీరు ప్రేమలో పడ్డారా?’ అనీ, రెండోది ‘పెళ్లెప్పుడు’ అనీ. పెళ్లెప్పుడు అని నేను చెప్పలేను కానీ, ప్రేమ గురించి చెబుతా. అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అన్నయ్య ప్రేమ... ఇవి నాకు సంపూర్ణంగా లభిస్తున్నాయి. ‘అబ్బాయితో ప్రేమ’ గురించి చెప్పాలంటే.. ఇప్పటిదాకా ఆ అనుభవం లేదు. ‘లవ్‌లో పడ్డారా?’ అనే ప్రశ్నకు ‘అవును పడ్డా’ అని చెప్పాలని నాకనిపిస్తుంటుంది.
 
  కానీ, ఎలా? ఇప్పటివరకూ పడలేదే? పోనీ పడదామంటే.. నాకు నచ్చిన అబ్బాయి తారసడాలి కదా. నాకు పరిచయం ఉన్నవాళ్లల్లో ఎవరిలోనైనా నాకు నచ్చే లక్షణాలు ఉండి ఉండొచ్చేమో. కానీ, అతనిలో ఆ లక్షణాలున్నాయని గ్రహించే తీరిక నాకెక్కడిది? ఈరోజు సీన్ ఏంటి? డైలాగ్స్ ఎలా ఉంటాయి? అనే ఆలోచన తప్ప, మనసురం నచ్చిన అబ్బాయి దొరుకుతాడా? అనే ఆలోచనే లేదాయె. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రేమించడానికి టైమెక్కడుందండీ? అందుకే చెబుతున్నా.. ప్రస్తుతానికి నా ప్రేమ మొత్తాన్నీ సినిమాలకే ఇచ్చేశా.’’
  - తమన్నా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement