ప్రియాంక పెళ్లి : 13 ఏళ్ల క్రితమే జోస్యం | Priyanka Chopra Wedding Bells Were Predicted 13 Years Ago?  | Sakshi
Sakshi News home page

ప్రియాంక పెళ్లి : 13 ఏళ్ల క్రితమే జోస్యం

Published Thu, Aug 23 2018 7:15 PM | Last Updated on Thu, Aug 23 2018 7:42 PM

Priyanka Chopra Wedding Bells Were Predicted 13 Years Ago?  - Sakshi

కాబోయే వధూవరులు ప్రియాంక చోప్రా - నిక్‌ జోనస్‌

ముంబై : బాలీవుడ్‌ అంతా నటి ప్రియాంక చోప్రా-అమెరికన్‌ సింగన్‌ నిక్‌ జోనస్‌ల పెళ్లి గురించే చర్చ. చాలా రోజులుగా ఎన్ని వార్తలు చక్కర్లు కొట్టినా.. చడీచప్పుడు కాకుండా ఉన్న వీరిద్దరూ.. గత వారం భారత్‌లో ప్రియాంక ఇంట్లో పూజలు చేసి, అధికారికంగా నిశ్చితార్థం చేసుకున్నారు. దీంతో ప్రియాంక పెళ్లి ఫిక్సయిందని అధికారికంగా తెలిసిపోయింది. బాలీవుడ్‌ స్నేహితులందరికీ.. ప్రియాంక నిశ్చితార్థపు పార్టీ కూడా ఇచ్చింది. అయితే ప్రియాంక పెళ్లి ఎప్పుడు జరుగుతుందో 13 ఏళ్ల క్రితమే తెలిసిపోయిందట. ప్రియాంక 36 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటుందని 2005లోనే సంజయ్‌ బీ జుమాని అనే జ్యోతిష్య, సంఖ్యా శాస్త్రవేత్త, జోస్యం చెప్పారు. అప్పట్లో ఫిల్మ్‌ఫేర్‌ వారు సంజయ్‌ జోస్యాన్ని పబ్లిష్‌ కూడా చేశారు. ప్రియాంక పెళ్లిపైనే కాక, ప్రియాంక పెళ్లి ముందటి జీవితం, పెళ్లి, ఆ తర్వాత 45 ఏళ్ల వయసులో ఆమె దేనిపై ఎక్కువగా ఆసక్తి చూపుతుందో తెలుపుతూ సంజయ్‌ జ్యోతిష్యం చెప్పారు. 

ప్రియాంక పుట్టింది 18వ తేదీ, 7వ నెల, 1982 సంవత్సరంలో. అంటే మొత్తంగా కలిపితే ఆమె నెంబర్‌ 9. ఈ నెంబర్‌ వల్ల ఆమె 36 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని సంజయ్‌ ఓ కాలమ్‌ ప్రచురణలో పేర్కొన్నారు. 36ను కలిపితే కూడా తొమ్మిదే వస్తుంది. ‘నెంబర్‌ 9ను కలిగిన వారిని గురు నడిపిస్తూ ఉంటాడు. అత్యంత శక్తి వంతమైన గ్రహం ఇది. వీరు అన్నింట్లో ముందంజలో ఉంటారు. అందుకే ప్రియాంక కూడా మహిళల్లో ప్రథమస్థానంలో ఉన్నారు. అన్ని అంశాల్లో కూడా వీరు పోరాడి గెలుస్తారు. అందుకే నాయకులిగా ఎదుగుతారు. రాజకీయాలపై వీరు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. ప్రియాంక కూడా 45 ఏళ్ల వయసులో రాజకీయాలపై ఆసక్తి చూపుతారు. 18 ఏళ్ల వయసులోనే ఆమె మిస్‌ వరల్డ్‌ అయ్యారు. ఆ నెంబర్‌ కూడా తొమ్మిదే. రెండు విజయవంతమైన సినిమాలు ఫ్యాషన్‌, దోస్తానా రెండూ కూడా 27ఏళ్ల(9) వయసులో తీసినవే. అవి ఆమెను కెరీర్‌లో టాప్‌లో నిల్చునేలా చేశాయి’ అని వివరించుకుంటూ వచ్చారు. 

సంజయ్‌ అంచనాలను 2005లో ఫిల్మ్‌ఫేర్‌ ప్రచురించింది. ‘ప్రియాంక ప్రవహించే నీటికి సంకేతం. దీంతో ఆమెకు ఎక్కువగా ప్రయాణించాలని ఉంటుంది. అలా ప్రయాణిస్తూనే ఉంటుంది. ముంబైలోనే తన కెరీర్‌కు పునాది వేసుకుంది. ముంబై పరిసర ప్రాంతాల్లో నీరు ఎక్కువగా ఉంటాయి. ప్రియాంక ప్రవహించే నీటికి సంకేతమైతే, నిక్‌ నిశ్చలమైన భూమికి సంకేతం. అంటే భూమి, నీరు ఎప్పుడూ కలిసి ఉన్నట్టే.. నిక్‌, ప్రియాంక కూడా ఎల్లవేళలా జతగా ఉంటారు. ఈ ఇద్దరిన్నీ చంద్రుడు, నెఫ్ట్యూన్‌ గ్రహాలు పాలిస్తూ ఉంటాయి. ఈ గ్రహాలు మానసికంగా కొంత ప్రభావం చూపొచ్చు. కావున నిక్‌ యోగా, ప్రాణాయామం, మెడిటేషన్‌ చేస్తే మంచిది. పీసీ కూడా ప్రశాంతంగా ఉండేందుకు యోగ, ఎక్సర్‌సైజులు చేయాలి’ అని ఈ జ్యోతిష్యుడు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement