ఆస్పత్రిలో సినీ నిర్మాత నట్టికుమార్ | Producer natti kumar joins in hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో సినీ నిర్మాత నట్టికుమార్

Published Sun, Aug 28 2016 5:00 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

ఆస్పత్రిలో సినీ నిర్మాత నట్టికుమార్ - Sakshi

ఆస్పత్రిలో సినీ నిర్మాత నట్టికుమార్

హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ శనివారం రాత్రి ఆస్పత్రి పాలయ్యారు. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ అనంతరం అతనికి సంబంధించిన పలు సంచలన విషయాలు చెప్పిన నట్టికుమార్ అనూహ్యంగా ఇలా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి. ఆయన అనారోగ్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురి సినీ నిర్మాతలకు నయీం గ్యాంగ్తో సంబంధాలున్నాయని నట్టికుమార్ గత వారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నిర్మాత మండలి నట్టికుమార్ వ్యాఖ్యలను ఖండించగా, ఆయన చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారని చెప్పారు. నట్టికుమార్ అనారోగ్యం వ్యవహారానికి సంబంధించిన సమాచారం తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement