హీరోయిన్‌ ను కోర్టుకీడుస్తాం | Producer to take legal action against Tamil actress | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ ను కోర్టుకీడుస్తాం

Published Tue, Jun 7 2016 3:04 AM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

హీరోయిన్‌ ను కోర్టుకీడుస్తాం - Sakshi

హీరోయిన్‌ ను కోర్టుకీడుస్తాం

 నిర్మాతలతో ఆడుకుంటున్న నటి ఇషారాను కోర్టుకీడుస్తామని అంటున్నారు ఎంగడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్ర దర్శకనిర్మాతలు.చదరంగవేట్టై, పప్పాళి చిత్రాల కథానాయకి ఇషారా. కేరళకు చెందిన ఈ అమ్మడు తాజాగా కల్లూరి చిత్రం ఫేమ్ అఖిల్ హీరోగా నటిస్తున్న ఎంగడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్రంలో హీరోయిన్‌గా ఒప్పందం చేసుకున్నారు. టీఎన్.75 కేకే క్రియేషన్స్ పతాకంపై జోసెఫ్ లారెన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
  ఈ చిత్రంలో రెండు రోజులు మాత్రమే నటించిన నటి ఇషారా ఆ తరువాత ఎస్కేప్ అయ్యి చిత్ర దర్శక నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతున్నారట. ఇషారా ప్రవర్తనకు విసిగి వేసారిన వారు ఆమెను కోర్టుకు ఈడుస్తామంటున్నారు. ఈ కథేంటో చిత్ర దర్శక నిర్మాతల మాటల్లోనే చూద్దాం. ‘మా ఎండడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్రంలో హీరోయిన్‌గా నటించడానికి నటి ఇషారాను నాలుగు లక్షల పారితోషికానికి 28-02-2016న ఒప్పందం కుదుర్చుకుని రూ.75 వేలు అడ్వాన్స్ చెల్లించాం.
 
  ఆమెను 20 రోజుల కాల్‌షీట్స్ అడిగాం. అయితే రెండు రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొని ఆ తరువాత ఎస్కేప్ అయ్యారు. మేం ఫోన్ చేస్తే తాను దుబాయ్‌లో ఉన్నాను, కేరళలో ఉన్నాను, వేరే షూటింగ్‌లో ఉన్నాను అంటూ చెబుతున్నారు. మరోసారి దర్శకుడు ముందు చెప్పిన కథ వేరు ఇప్పుడు తీస్తున్న కథ వేరు అని సాకు చెప్పారు. మరో సారి ఆమెను ఫోన్‌లో సంప్రదించగా ఎవరిదో మగ గొంతు పిలుస్తాను ఉండండి అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో కథలో ఏమైనా మార్పులు చేయడానికైనా సిద్ధం అని మెసేజ్ పెట్టగా ఇదుగో వస్తున్నా, అదుగో వస్తున్నా అని చెప్పి షూటింగ్‌కు రాలేదు.
 
 వేరే దారి లేక మేము కేరళ నడిగర్ సంఘాన్ని ఆశ్రయించాం. వారికి ఇషారా సరైన సమాధానం ఇవ్వలేదట. మరో ప్రయత్నంగా నిర్మాతల గిల్డ్‌కు చెందిన జాగ్వుర్‌తంగం ద్వారా ఇషారాతో మాట్లాడించాం. ఆయనకు సరైన బదులు ఇవ్వలేదు. ఇక లాభం లేదని పత్రికలకెక్కుతామనీ, కోర్టుకెళ్లతామనీ చెప్పాం. అందుకామె వెళ్లండి అంటూ చాలా కేర్‌లెస్‌గా బదులిచ్చారు. ఇలాంటి వారిని నమ్మి  మాలాంటి నిర్మాతలు కోట్లు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నాం. మా పెట్టుబడులతో ఆడుకునే ఇషారాను కోర్టుకు ఈడుస్తాం’ అని ఎంగడా ఇదుందీంగ ఇవ్వళవు నాళా చిత్ర నిర్మాతలు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement