Rs 75
-
త్వరలో విడుదల కానున్న రూ. 75 కాయిన్ - ప్రత్యేకతేంటంటే?
Rs 75 Special Coin: నూతన పార్లమెంట్ భవనం త్వరలో ప్రారంభం కానున్న విషయం అందరికి తెలిసిందే. ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం రూ. 75 కాయిన్ విడుదల చేయడానికి సంకల్పించింది. త్వరలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న రూ. 75 కాయిన్ ప్రత్యేకతలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రూ. 75 నాణెం సాధారణ కాయిన్స్ మాదిరిగా కాకుండా.. భిన్నంగా ఉంటుంది. ఈ నాణెం బరువు 35 గ్రాములు వరకు ఉంటుంది. దీనిని 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ కలయికతో తయారు చేయనున్నారు. వ్యాసం 44 మిల్లీ మీటర్స్ వరకు ఉంటుంది. ప్రత్యేకతలు 75 రూపాయల నాణెం చాలా ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం. ఇందులో ఆశోక స్తంభంపై ఉండే నాలుగు సింహాల చిహ్నం, దాని కింద 'సత్యమేవ జయతే' అనే వాక్యం ఉంటుంది. ఎడమవైపు దేవనాగరి లిపిలో భారత్ అనే పదం, కుడివైపున ఇంగ్లిష్‌లో ఇండియా అనే పదం ఉంటుంది. దీనికి మధ్య భాగంలో దాని విలువను తెలియజేయడానికి 75 అనే సంఖ్య, కాయిన్ ఎగువ అంచుపై 'సంసద్ సంకుల్' అని దేవనగరి స్క్రిప్ట్‌లో, దిగువ అంచున 'పార్లమెంట్ కాంప్లెక్స్' ఉండనున్నాయి. ప్రస్తుతం 1, 2,5,10 రూపాయల నాణేలు అందుబాటులో ఉన్నాయి. అయితే 10 నాణెం వాడకం బాగా తగ్గింది. ఇక త్వరలో కాయిన్స్ జాబితాలోకి రూ. 75 నాణెం కూడా చేరనుంది. ఇది మాత్రమే కాకుండా రూ. 100 నాణెం కూడా గతంలోనే వెల్లడించారు. ఇది మన్‌కీ బాత్ 100 ఏపీసోడ్ సందర్భంగా విడుదల చేశారు. అయితే ఇది సాధారణ కాయిన్ మాదిరిగా వాడుకునే అవకాశం లేదు. ఇప్పుడు త్వరలో విడుదలకానున్న రూ. 75 కాయిన్ కూడా సాధారణ ప్రజలు వాడుకోవడానికి అందుబాటులో వస్తుందా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
హీరోయిన్ ను కోర్టుకీడుస్తాం
నిర్మాతలతో ఆడుకుంటున్న నటి ఇషారాను కోర్టుకీడుస్తామని అంటున్నారు ఎంగడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్ర దర్శకనిర్మాతలు.చదరంగవేట్టై, పప్పాళి చిత్రాల కథానాయకి ఇషారా. కేరళకు చెందిన ఈ అమ్మడు తాజాగా కల్లూరి చిత్రం ఫేమ్ అఖిల్ హీరోగా నటిస్తున్న ఎంగడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్రంలో హీరోయిన్గా ఒప్పందం చేసుకున్నారు. టీఎన్.75 కేకే క్రియేషన్స్ పతాకంపై జోసెఫ్ లారెన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెవిన్ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రెండు రోజులు మాత్రమే నటించిన నటి ఇషారా ఆ తరువాత ఎస్కేప్ అయ్యి చిత్ర దర్శక నిర్మాతలను ముప్పతిప్పలు పెడుతున్నారట. ఇషారా ప్రవర్తనకు విసిగి వేసారిన వారు ఆమెను కోర్టుకు ఈడుస్తామంటున్నారు. ఈ కథేంటో చిత్ర దర్శక నిర్మాతల మాటల్లోనే చూద్దాం. ‘మా ఎండడా ఇరుందీంగ ఇవ్వళవు నాళా చిత్రంలో హీరోయిన్గా నటించడానికి నటి ఇషారాను నాలుగు లక్షల పారితోషికానికి 28-02-2016న ఒప్పందం కుదుర్చుకుని రూ.75 వేలు అడ్వాన్స్ చెల్లించాం. ఆమెను 20 రోజుల కాల్షీట్స్ అడిగాం. అయితే రెండు రోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొని ఆ తరువాత ఎస్కేప్ అయ్యారు. మేం ఫోన్ చేస్తే తాను దుబాయ్‌లో ఉన్నాను, కేరళలో ఉన్నాను, వేరే షూటింగ్లో ఉన్నాను అంటూ చెబుతున్నారు. మరోసారి దర్శకుడు ముందు చెప్పిన కథ వేరు ఇప్పుడు తీస్తున్న కథ వేరు అని సాకు చెప్పారు. మరో సారి ఆమెను ఫోన్లో సంప్రదించగా ఎవరిదో మగ గొంతు పిలుస్తాను ఉండండి అని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో కథలో ఏమైనా మార్పులు చేయడానికైనా సిద్ధం అని మెసేజ్ పెట్టగా ఇదుగో వస్తున్నా, అదుగో వస్తున్నా అని చెప్పి షూటింగ్‌కు రాలేదు. వేరే దారి లేక మేము కేరళ నడిగర్ సంఘాన్ని ఆశ్రయించాం. వారికి ఇషారా సరైన సమాధానం ఇవ్వలేదట. మరో ప్రయత్నంగా నిర్మాతల గిల్డ్‌కు చెందిన జాగ్వుర్‌తంగం ద్వారా ఇషారాతో మాట్లాడించాం. ఆయనకు సరైన బదులు ఇవ్వలేదు. ఇక లాభం లేదని పత్రికలకెక్కుతామనీ, కోర్టుకెళ్లతామనీ చెప్పాం. అందుకామె వెళ్లండి అంటూ చాలా కేర్లెస్గా బదులిచ్చారు. ఇలాంటి వారిని నమ్మి మాలాంటి నిర్మాతలు కోట్లు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నాం. మా పెట్టుబడులతో ఆడుకునే ఇషారాను కోర్టుకు ఈడుస్తాం’ అని ఎంగడా ఇదుందీంగ ఇవ్వళవు నాళా చిత్ర నిర్మాతలు తెలిపారు.