
ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం.. టాస్క్ బిగ్‌బాస్‌కు చుక్కలు చూపిస్తోంది. ఈ టాస్క్‌లో భాగంగా పునర్నవి, మహేష్‌లు బిగ్‌బాస్‌కు ఎదురుతిరిగారు. టాస్క్‌లో చెత్త పర్ఫామెన్స్ ఇచ్చిన కంటెస్టెంట్లుగా పునర్నవి, మహేష్, శ్రీముఖి పేర్లను తెలిపాడు. ఆ ముగ్గురికి షూస్ పాలిష్ చేయాలనే మరో టాస్క్‌ను ఇచ్చాడు. ఇంటి సభ్యుల షూస్‌ను కూడా పాలిష్ చేయాల్సి ఉంటుందని తెలిపాడు.
బిగ్‌బాస్‌ను ఎదిరించిన పునర్నవి
అయితే ఈ టాస్క్‌ను చేయడానికి పునర్నవి, మహేష్‌లు ససేమిరా ఒప్పుకోలేదు. ఒకవేళ ఈ కారణంగా ఎలిమినేట్ చేసిన పర్లేదంటూ పునర్నవి భీష్మించుకు కూర్చుంది. ఇవీ ఓ టాస్కులా.. మీరే ఆడుకోండి అంటూ బిగ్‌బాస్‌పై ఫైర్ అయింది. అన్నివేళలా బిగ్‌బాస్ కరెక్ట్ కాదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టాస్క్‌లు ఇస్తే కరెక్ట్‌గా ఇవ్వాలని సూచించింది. దెయ్యాలు ఏం చేసినా.. మనుషులు రియాక్ట్ కాకూడదని.. టాస్క్ ఇవ్వడం ఏంటని.. మళ్లీ తమనే దెయ్యాలుగా మార్చడమేంటని ఫైర్ అయింది.
శివజ్యోతి బుజ్జగించడంతో ఒప్పుకున్న మహేష్
షూస్ పాలిష్ చేయమన్నడు రేపు చెడ్డీలు ఉతకమంటాడు.. ఏంటి ఈ టాస్క్‌లు అంటూ మహేష్‌పై ఫైర్ అయ్యాడు. ఏం పని లేకుండా ఇక్కడుకు వచ్చామా? మా అంతట మేము వచ్చామా? మీరు రమ్మంటే వచ్చామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టాస్క్‌లో భాగంగా తన బట్టలు చినిగిపోయాయని, అవన్నీ బిగ్‌బాస్ తిరిగి మళ్లీ పంపిస్తాడా? అంటూ మండిపడ్డాడు. అయితే శివజ్యోతి బుజ్జగించడంతో మహేష్ కాస్త వెనక్కి తగ్గాడు. పాలిష్ చేసి అవతల పాడేస్తా? కిరోసోన్ ఉంటే అన్నింటిని కాల్చేస్తా? అంటూ మొత్తానికి పాలిష్ చేసేందుకు రంగంలోకి దిగాడు. ఇక శ్రీముఖి ముందునుంచీ ఈ టాస్క్‌ను చేసేందుకు రెడీగానే ఉంది.
ఆగ్రహించిన బిగ్‌బాస్
వీరి వ్యవహారంపై బిగ్‌బాస్ కన్నెర్ర చేశాడు. హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యులందరూ.. ప్రతీ ఆదేశాన్ని తప్పకపాటించాల్సి ఉంటుందని తెలిపారు. లేనిపక్షంలో వారిని వచ్చేవారం నేరుగా నామినేట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అనంతరం షూస్‌ను పాలిష్ చేసేందుకు మహేష్, శ్రీముఖి అంగీకరించినా.. పునర్నవి మాత్రం తన మాట మీద నిలబడింది. పునర్నవి విషయంలో బిగ్‌బాస్ వెనక్కు తగ్గుతాడా? లేదా? అన్నది చూడాలి. ఇక రేపటి టాస్క్‌లో గెలిచి కెప్టెన్‌గా ఎవరు ఎన్నికవుతారో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment