
బిగ్‌బాస్ సీజన్ 3.. చూస్తుండగానే 50 రోజులు పూర్తయ్యాయి. ఇక అసలు యుద్ధం ఇప్పుడు మొదలవుతుంది. ఒక్కో రోజు గడుస్తూ ఉందంటే బిగ్‌బాస్ బిగ్‌ఫైట్‌కు తెర తీస్తున్నట్టే. ఇప్పటికే ఆరుగురు ఇంటిని వీడగా మరో 11 మంది బిగ్‌బాస్ టైటిల్ కొట్టేయడానికి హోరాహోరీగా తలపడనున్నారు. ఎనిమిదోవారం ఇంటిని వీడడానికి అయిదుగురు నామినేట్ కాగా అందులో నలుగురు మహిళలే ఉండటం గమనార్హం. బిగ్‌బాస్ హాఫ్ జర్నీ సాఫీగా సాగినా మున్ముందు అంత సులువుగా ఉండే అవకాశం లేదు. ఇప్పుడు మొదలవుతున్న అసలైన రేసును కష్టతరం చేయడానికి బిగ్‌బాస్ మరింత కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నో రకాల ఆటలు ఆడించిన బిగ్‌బాస్ ఇప్పుడు సరికొత్తగా హారర్ గేమ్ ఆడించనున్నాడు.
‘దయ్యాలు ఉన్నాయి జాగ్రత్త’ టాస్క్‌లో గెలుపు కోసం ఇంటి సభ్యులు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక నామినేషన్ పర్వం ముగిసింది. ఎలిమినేషన్ నుంచి తప్పించుకోడానికి వెనుకడుగు వేయకుండా శ్రమిస్తున్నారు హౌస్‌మేట్స్. మరి టాస్క్ ఇచ్చాక అందులో పోట్లాట జరగకుండా ఉంటుందా.. దెయ్యాల టాస్క్‌లో బాబా భాస్కర్, వితిక, హిమజ, శిల్ప చక్రవర్తి ఒక్కటై పునర్నవిని టార్గెట్ చేశారు. ఆ నలుగురు కలిసి పునర్నవిని ఈడ్చుకొచ్చి స్విమ్మింగ్ పూల్‌లో పడేశారు. దీంతో పునర్నవి వరుణ్‌తో.. ఏంటిదంతా అంటూ ఆవేదనను వెల్లగక్కింది. అలా బయటకు తోసేయడం టాస్కా? అని వరుణ్‌ను ప్రశ్నించింది. వరుణ్ అవునని సమాధానం చెప్పినప్పటికీ తట్టుకోలేకపోయింది. అలా లాక్కొచ్చి పడేయటాన్ని సహించలేని పునర్నవి ‘నేను ఈ గేమ్ ఆడలేనంటూ’ బిగ్‌బాస్‌పై సీరియస్ అయింది. అంతటితో ఆగక ఆవేశంతో బిగ్‌బాస్‌నే గేమ్ ఆడుకోమని సలహా ఇచ్చింది. అసలు వారు కావాలనే పునర్నవిని టార్గెట్ చేశారా? లేక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా చేశారా అన్నది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment