ఎమోషనల్ లవ్ స్టోరీ...
ఎమోషనల్ లవ్ స్టోరీ...
Published Tue, Jan 21 2014 12:13 AM | Last Updated on Fri, Jul 12 2019 4:40 PM
పవన్‌సాయి, హేమంతిని జంటగా రాజు కుంపట్ల దర్శకత్వంలో తడకల రాజేష్ నిర్మించిన చిత్రం ‘ప్యూర్ లవ్’. జాన్ పోట్ల స్వరపరచిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత సి.కల్యాణ్ ఆడియో సీడీని ఆవిష్కరించగా, మాజీ మంత్రి శంకరరావు స్వీకరిం చారు. ఈ వేడుకలో అశోక్‌కుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తడకల రాజేష్ మాట్లాడుతూ -‘‘ఇదొక అందమైన ప్రేమకథా చిత్రం. దర్శకుడు ఈ కథ చెప్పగానే విజయవంతమైన చిత్రం అవుతుందనిపించి, నిర్మించాను. కథ, పాటలు, ఫొటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తాయి’’ అన్నారు. ఈ పాటలను, సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని దర్శకుడు తెలిపారు. ఇది ఎమోషన్ లవ్‌స్టోరీ అని పవన్‌సాయి చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ అని సంగీతదర్శకుడు అన్నారు.
Advertisement
Advertisement