
మహేశ్‌బాబు, పూరి జగన్నాథ్, యశ్
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్ ఇచ్చారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ సినిమా తర్వాత ‘జనగణమన’ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘జనగణమన’ చిత్రం మహేశ్‌బాబుతో హ్యాట్రిక్ కోసం తయారు చేసిన స్క్రిప్ట్ అని పూరి ఇదివరకు ప్రకటించారు. ‘పోకిరి, బిజినెస్‌మేన్’ వంటి హిట్స్ ఈ కాంబినేషన్‌లో వచ్చిన విషయం తెలిసిందే.
‘జనగణమన’ సినిమా గురించి మహేశ్ నుంచి ఎటువంటి కన్‌ఫర్మేషన్ రాలేదని పూరి తెలిపారు. తాజాగా ఈ సినిమాను కన్నడ హీరో యశ్‌తో ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ‘జనగణమన’ ఐడియాను యశ్‌కు పూరి చెప్పడం, తను కూడా ఆసక్తి చూపించడం జరిగిందట. కన్నడ– తెలుగు ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కించాలనే ప్లాన్‌లో పూరి ఉన్నారనే వార్త వినిపిస్తోంది. ఇంతకీ... పూరి రాసిన ‘జనగణ మన’ను పాడేది ఎవరో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment