![Rajamouli Multi Starrer New Update - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/27/Jr%20Ntr%20Ram%20Charan.jpg.webp?itok=XOHbrHpG)
బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి ఓ భారీ మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్ అంటూ ఓ చిన్న వీడియోను కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ ఎప్పుడూ మొదలవుతుంది అన్న విషయంపై మాత్రం ఇంతవరకు ఎలాంటి ప్రకటన లేదు.
తాజాగా ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాను అక్టోబర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్ నుంచి రాజమౌళి సినిమా పనుల్లో బిజీ కానున్నాడు జూనియర్. రామ్ చరణ్ కూడా డిసెంబర్ కల్లా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను ముంగిచేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
డిసెంబర్ నెలాఖరు కల్లా చరణ్ కూడా రాజమౌళి టీంతో జాయిన్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఆర్ట్ వర్క్ అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్‌పై త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment