ప్రొఫెసర్‌! | rajanikanth new movie updates | Sakshi
Sakshi News home page

ప్రొఫెసర్‌!

Published Wed, Jul 11 2018 12:38 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

rajanikanth new movie updates - Sakshi

పుస్తకాలతో కుస్తీ పడుతున్నారట రజనీకాంత్‌. మరి.. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పాలంటే ప్రొఫెసర్‌ ప్రిపేర్‌ అవ్వాలి కదా. రజనీకాంత్‌ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్‌ కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్‌ ప్రొఫెసర్‌గా కనిపించనున్నారని కోలీవుడ్‌ టాక్‌. ఈ సినిమా షూటింగ్‌ డార్జిలింగ్‌లో మొదలైన సంగతి తెలిసిందే. దాదాపు నెలరోజుల పాటు డార్జిలింగ్‌లో షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీటైంది.

సెకండ్‌ షెడ్యూల్‌లో విజయ్‌ సేతుపతి జాయిన్‌ అవుతారట. కానీ ఈ సినిమా సెకండ్‌ షెడ్యూల్‌ డెహ్రాడూన్‌లో జరగనుందని కొందరు, లేదు ఆల్రెడీ మధురైలో సెట్‌ వర్క్‌ స్టారై్టందని, సెకండ్‌ షెడ్యూల్‌ అక్కడే జరగనుందని మరికొందరు అంటున్నారు. మరి ఎక్కడ అన్నది తెలియాలంటే జస్ట్‌ వారం రోజులు ఆగితే తెలుస్తుంది. ఓ స్మాల్‌ బ్రేక్‌ ఇచ్చి సెకండ్‌ షెడ్యూల్‌ షూట్‌లో పాల్గొంటారట రజనీ. ప్రస్తుతం ఆయన చెన్నైలోనే ఉన్నారట. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిరు«ద్‌ రవిచంద్రన్‌ స్వరాలు అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement