subbaraj
-
రైల్వేస్టేషన్లో...!
ఫుల్‌గా గడ్డం పెంచేసి కొత్త లుక్‌లోకి మారిపోయారు నాగచైతన్య. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా రూపొందుతున్న సినిమా ‘మజిలీ’(వర్కింగ్ టైటిల్). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లోని రైల్వేస్టేషన్లో జరుగుతోంది. నాగౖచైతన్య, సమంతలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇవి ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో సీన్స్ అని టాక్. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దంపతులుగా మారిన తర్వాత నాగచైతన్య, సమంత తొలిసారి నటిస్తున్న చిత్రమిది. ఇందులో నాగచైతన్య ఓ మాజీ క్రికెటర్ పాత్రలో కనిపించనున్నారని టాక్. నటుడు సుబ్బరాజ్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్ చేయాలని టీమ్ నిర్ణయించుకుందట. వచ్చే సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. -
ప్రొఫెసర్!
పుస్తకాలతో కుస్తీ పడుతున్నారట రజనీకాంత్. మరి.. స్టూడెంట్స్‌కు పాఠాలు చెప్పాలంటే ప్రొఫెసర్ ప్రిపేర్ అవ్వాలి కదా. రజనీకాంత్ హీరోగా ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ప్రొఫెసర్‌గా కనిపించనున్నారని కోలీవుడ్ టాక్. ఈ సినిమా షూటింగ్ డార్జిలింగ్‌లో మొదలైన సంగతి తెలిసిందే. దాదాపు నెలరోజుల పాటు డార్జిలింగ్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కంప్లీటైంది. సెకండ్ షెడ్యూల్లో విజయ్ సేతుపతి జాయిన్ అవుతారట. కానీ ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ డెహ్రాడూన్‌లో జరగనుందని కొందరు, లేదు ఆల్రెడీ మధురైలో సెట్ వర్క్ స్టారై్టందని, సెకండ్ షెడ్యూల్ అక్కడే జరగనుందని మరికొందరు అంటున్నారు. మరి ఎక్కడ అన్నది తెలియాలంటే జస్ట్ వారం రోజులు ఆగితే తెలుస్తుంది. ఓ స్మాల్ బ్రేక్ ఇచ్చి సెకండ్ షెడ్యూల్ షూట్లో పాల్గొంటారట రజనీ. ప్రస్తుతం ఆయన చెన్నైలోనే ఉన్నారట. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు అనిరు«ద్ రవిచంద్రన్ స్వరాలు అందిస్తున్నారు. -
తండ్రి కల నెరవేర్చడం కోసం..
తమిళసినిమా: సాధారణంగా పిల్లల కలలను నెరవేర్చడానికి తలిదండ్రులు త్యాగాలకు సిద్ధపడుతుంటారు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి చిరకాలంగా నెరవేరని తన తండ్రి కలను సాకారం చేయడానికి నడుం బిగించారు. ఆయనే దర్శకుడు సుబ్బరాజ్. ఈయన సినిమాల్లో నటించాలన్న తన తండ్రి చిరకాల కోరికను నెరవేర్చడానికి తానే దర్శక నిర్మాతగా మారారు. అలా ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం అరళి. పిల్లలు ప్రయోజకులు కావడానికి, పక్కదారి పట్టడానికి తల్లిదండ్రులే కారణం అనే ఇతి వృత్తంతో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రధానపాత్రను దర్శక నిర్మాత సుబ్బరాజ్ తండ్రి అరుణాచలం నటిస్తున్నారు. ఆయనతో పాటు సుబ్బరాజ్ కూడా కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రంలో మధుసూధన్, మంజులా రాథోడ్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాళీదాస్, అమృతలింగం,కోవైసెంధిల్, సైకిల్మణి,రాజ్‌కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. మరో విశేషం ఏమిటంటే సుబ్బరాజ్ తల్లిదండ్రులను స్మరించాలి అన్న స్లోగన్‌తో చెన్నై నుంచి కన్యాకుమారి వరకూ సైకిల్ ర్యాలీ తలపెట్టారు. శనివారం సాయంత్రం స్థానికి టీ.నగర్‌లోని ఎంఎం ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన అరళి చిత్ర విలేకరుల సమావేశంలో అతిథులుగా నటుడు రాధారవి, నిర్మాత ఎడిటర్ మోహన్, జాగ్వుర్‌తంగం తదితరులు పాల్గొన్నారు. సుబ్బరాజ్‌కు తల్లిదండ్రులపై ఉన్న ప్రేమాభిమానాలు చూసి నటుడు రాధారవి త్వరలో చిత్రం నిర్మించనున్నానని, దానికి సుబ్బరాజ్‌కు దర్శకుడిగా అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. కాగా తల్లిదండ్రులను స్మరించాలి అన్న స్లోగన్‌తో సైకిల్ యాత్ర చేపట్టిన సుబ్బరాజ్‌కు అతిథులు జెండా ఊపి సాగనంపారు. -
సీపీఐ నిర్మాణం భ్రష్టుపట్టింది...
పోటీ చేసి ఉండాల్సింది కాదు.. నారాయణపై నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మెల్యే సుబ్బరాజు సాక్షి, విజయవాడ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ వ్యవహారశైలి వల్ల పార్టీ నిర్మాణం భ్రష్టుపట్టిపోయిందని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కె.సుబ్బరాజు ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి వ్యవహారశైలిని నిరసిస్తూ ఆయన నారాయణకు నాలుగు పేజీల లేఖ రాశారు. బూర్జువా పార్టీలతో నేస్తం, వాణిజ్య, పారిశ్రామిక, బడా కాంట్రాక్టు సంస్థలతో సంబంధాలు, నాయకుల ఆర్థిక అరాచకానికి తోడ్పాటు వల్లే గత ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పార్టీ వైఫల్యం చెందిందని ఆరోపించారు. పార్టీ ఎన్నడూ ఎరుగని రీతిలో డిపాజిట్లు కోల్పోవడమే కాకుండా ఘోరమైన రీతిలో లభించిన ఓట్లు పార్టీ దిగజారుడుకు అద్దం పడుతోందన్నారు. దీన్ని రాజకీయ అంశాలపై జరిగిన నష్టం భావిస్తే పార్టీకి మరింత నష్టం చేసినవారవుతామని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పార్టీ అధినేతగా నిర్మాణ బాధ్యతలు నిర్వహించి, ప్రజల్లో సత్సంబంధాలు ఉన్న చోట పోటీ చేయడం అవసరమే అయినా, రాష్ట్రవ్యాప్త సమన్వయంతోపాటు చాలెంజ్‌గా కేంద్రీకరించాల్సిన నారాయణ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేయడం ఏమాత్రం సరికాదన్నారు. రెండు రాష్ట్రాల పార్టీ శ్రేణులు, ప్రజల్లో విభిన్న ధోరణులు మరిచిపోక ముందే ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా ఉండి ఒక రాష్ట్రంలో పోటీ చేయడం బాగోలేదని, కృష్ణాజిల్లాతో పాటు పలు జిల్లాల సమావేశాల నుంచి వచ్చిన సూచనలు పట్టించుకోకపోవడం సరికాదని పేర్కొన్నారు. బహిరంగ విమర్శలు వచ్చినప్పుడైనా పార్టీ పదవికి రాజీనామా చేసి ప్రచారంలో పాల్గొని ఉంటే రాష్ట్రవ్యాపితంగా కూడా పార్టీ గౌరవం పొంది కొంత నిలబడి ఉండేదన్నారు. ఎన్నికల తర్వాత ఖమ్మం పార్లమెంట్ స్థానంలో సీపీఎం నాయకుడిపై చేసిన ఆర్థిక ఆరోపణలు తొందరపాటు చర్య అన్నారు. తొందరపాటు, ఆ తర్వాత పశ్చాత్తాపాలు మీకు సహజం కాని, పార్టీ పట్ల ఏర్పడిన చులకన మరింత పెరుగుతోందన్నారు. కిందిస్థాయి సీపీఎం నాయకులు ప్రత్యారోపణలకు అవకాశం ఇచ్చినట్లయిందన్నారు. తెలంగాణలో కేంద్ర పార్టీ విధానానికి విరుద్ధంగా ప్రత్యేక పరిస్థితుల పేరుతో దేశమంతా ఛీకొట్టిన కాంగ్రెస్‌తో జత కట్టినా మనకు ఒరిగింది లేకపోగా పార్టీ ప్రతిష్ట మరింత దిగజారిందన్నారు. వామపక్ష ఉద్యమ కేంద్రం, సీపీఐకి గుండెకాయ లాంటి విజయవాడలో చారిత్రాత్మక పరాజయానికి నారాయణ కూడా బాధ్యులేనన్నారు. 130 ఏళ్ల విజయవాడ మున్సిపాలిటీ, కార్పొరేషన్ చరిత్రలో పలుసార్లు పాలించిన సీపీఐకి మొదటిసారి ప్రాతినిధ్యం లేకుండా పోవడం, అగ్రనాయకత్వం పోటీ చేసిన డివిజన్లలో కూడా డిపాజిట్లు కోల్పోవడం అవమానకరమన్నారు. నగర కార్యదర్శిగా ఉన్న దోనేపూడి శంకర్ ఏకపక్ష విధానాల వల్ల పార్టీ నష్టపోయిందన్నారు. కౌన్సిల్ సభ్యుడైన తనను ఏనాడు సమావేశాలకు పిలవకపోగా, 30 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న తనను అభ్యర్థుల ఎంపికలో భాగస్వామిని చేయలేదన్నారు. ఓటు వేసిన గుర్తు చెరగకముందే కార్పొరేటర్‌గా పోటీ చేసిన నగర కార్యదర్శిని ఎమ్మెల్యే స్థానానికి ఎంపిక చేయడం వల్ల పార్టీకి మరెవ్వరూ దిక్కులేదనే భావన కలిగిందన్నారు. ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేయిస్తానని తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. రాష్ట్రస్థాయి నుంచి నగర స్థాయి వరకూ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉందని సుబ్బరాజు డిమాండ్ చేశారు.