రైల్వేస్టేషన్‌లో...! | Samantha And Naga Chaitanya Make A Lovely Pair In Their New Film | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌లో...!

Published Wed, Nov 21 2018 12:43 AM | Last Updated on Wed, Nov 21 2018 12:43 AM

Samantha And Naga Chaitanya Make A Lovely Pair In Their New Film   - Sakshi

ఫుల్‌గా గడ్డం పెంచేసి కొత్త లుక్‌లోకి మారిపోయారు నాగచైతన్య. ‘నిన్ను కోరి’ ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా రూపొందుతున్న సినిమా ‘మజిలీ’(వర్కింగ్‌ టైటిల్‌). ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ వైజాగ్‌లోని రైల్వేస్టేషన్‌లో జరుగుతోంది. నాగౖచైతన్య, సమంతలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇవి ప్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో సీన్స్‌ అని టాక్‌. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

దంపతులుగా మారిన తర్వాత నాగచైతన్య, సమంత తొలిసారి నటిస్తున్న చిత్రమిది. ఇందులో నాగచైతన్య ఓ మాజీ క్రికెటర్‌ పాత్రలో కనిపించనున్నారని టాక్‌. నటుడు సుబ్బరాజ్‌ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ను ఫిబ్రవరి కల్లా కంప్లీట్‌ చేయాలని టీమ్‌ నిర్ణయించుకుందట. వచ్చే సమ్మర్‌లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement