రాజమౌళి మల్టీ స్టారర్‌లో మరో ‘ఆర్‌’ | Rajasekhar To Play Villain In Rajamouli Multi Starrer | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 28 2018 11:18 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

Rajasekhar To Play Villain In Rajamouli Multi Starrer - Sakshi

దర్శకధీరుడు రాజమౌళి, బాహుబలి లాంటి విజువల్‌ వండర్‌ తరువాత ఓ భారీ మల్టీ స్టారర్‌ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా అధికారిక ప్రకటనను వినూత్నం చేశారు. దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్‌, ఎన్టీఆర్‌ ల పేర్లలోని ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ అనే లోగోను రివీల్ చేశారు. తాజాగా ఈసినిమాలో మరో ఆర్‌ వచ్చిన చేరిందన్న టాక్ వినిపిస్తోంది. 

భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్‌గా ప్రముఖ హీరో రాజశేఖర్ నటించనున్నారట. గతంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన ధృవ సినిమాలోనే రాజశేఖర్‌ విలన్‌ గా నటించాల్సి ఉంది. కానీ అప్పట్లో ఈ కాంబినేషన్ కుదరలేదు. ఇటీవల గరుడవేగ సినిమాతో హీరోగా సూపర్‌ హిట్ సాధించిన రాజశేఖర్‌, రాజమౌళి దర‍్శకత్వంలో విలన్‌గా నటించేందుకు అంగీకరించారట. ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement