
ఇంటి తాళాలు అందిస్తున్న రజనీకాంత్
చెన్నై,పెరంబూరు: గత ఏడాది గజ తుపాన్ కారణంగా ఇళ్లు కోల్పోయిన డెల్టా జిల్లా ప్రాంత ప్రజల కు నటుడు రజనీకాంత్ 10 ఇళ్లను కట్టి ఇచ్చా రు. వాటిని సోమవారం ఉదయం ఆ ప్రాంత ప్రజలకు అందించారు. వివరాలు.. గత ఏడాది గజతుఫాన్ తమిళనాడును వణికించింది. డెట్టా జిల్లాకు చెందిన ప్రజలు తీవ్రంగా నష్టపోయా రు. నటుడు రజనీకాంత్ తన అభియాన సంఘాలకు డెల్టా జిల్లా ప్రాంత బాధితులను ఇతోదికంగా సాయం చేసి ఆదుకోవాల్సిందిగా పిలుపు నిచ్చారు. రజనీ ప్రజా సంఘం తరఫున డెల్లా జిల్లాలో ఇళ్లు కోల్పోయిన వారికి 10 ఇళ్లను కట్టించి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు నాగపట్టణం, తంజావూరు జిల్లాలలో ఇళ్లు కట్టించే పనులకు పూనుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment