రజనీకాంత్ ‘కోచడయాన్’ రెడీ | Rajinikanth Kochadaiyaan Ready to Release | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ ‘కోచడయాన్’ రెడీ

Published Sat, Jan 4 2014 11:52 PM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM

రజనీకాంత్ ‘కోచడయాన్’ రెడీ

రజనీకాంత్ ‘కోచడయాన్’ రెడీ

ఇదిగో వస్తోంది... అదిగో వచ్చేస్తోంది అంటూ గత రెండేళ్లుగా ‘కోచడయాన్’ చిత్రం ప్రేక్షకులతో దోబూచులాడుతోంది. అయితే, ఈ ఏడాదితో ఆ దోబూచులాటకు ఫుల్‌స్టాప్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే, తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణను ప్రేమికుల దినోత్సవం మర్నాడు అంటే ఫిబ్రవరి 15న జరపాలనుకుంటున్నారట. 
 
 ఆడియో విడుదల హక్కులను సోనీ మ్యూజిక్ దక్కించుకుందని వినికిడి. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని వైభవంగా జరపడానికి ఆ సంస్థ ప్లాన్ చేస్తోందట. రజనీకాంత్ హీరోగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీ సరసన దీపికా పదుకొనె కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, శోభన, ఆది తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం తెలుగులో ‘విక్రమసింహా’ పేరుతో విడుదల కానుంది. ఇంకా హిందీతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement