రజనీకాంత్ కోచడయాన్ మళ్లీ వాయిదా? | Rajinikanth's 'Kochadaiiyaan' now to release May 1? | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ కోచడయాన్ మళ్లీ వాయిదా?

Published Sat, Mar 29 2014 3:31 PM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

రజనీకాంత్ కోచడయాన్ మళ్లీ వాయిదా?

రజనీకాంత్ కోచడయాన్ మళ్లీ వాయిదా?

ముంబై: రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కోచడయాన్ చిత్రం విడుదల తేదీ మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. మే 1న ఈ సినిమాను విడుదల చేయవచ్చని ఈ ప్రాజెక్ట్ అత్యంత సన్నిహిత వర్గాలు తెలిపాయి. తమిళ సూపర్ స్టార్ రజనీ హీరోగా, ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో ఈ భారీ బడ్జెట్ సినిమాను తమిళంతో పాటు పలు భాషాల్లో రూపొందించారు.

తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అభిమానులు రెండేళ్లుగా నిరీక్షిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. రజనీ సరసన దీపికా పదుకొనె కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, శరత్‌కుమార్, శోభన, ఆది తదితరులు ఇతర పాత్రలు చేశారు. ఎ.ఆర్. రహమాన్ పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం తెలుగులో ‘విక్రమసింహా’ పేరుతో విడుదల కానుంది. ఇంకా హిందీతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement