ఆ పట్టింపు లేదు | Rakul Preet Singh Opens Up About Her Love Life | Sakshi
Sakshi News home page

ఆ పట్టింపు లేదు

Published Sat, May 4 2019 3:27 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Rakul Preet Singh Opens Up About Her Love Life - Sakshi

జీవితం ఎవర్నీ వదిలి పెట్టదు. ఓ ఆట ఆడుకుంటుంది. ఆటలో గెలుపోటములు సహజం. మీరు జీవితంలో ఎదురయ్యే వైఫల్యాలను ఎలా అధిగమిస్తారు? అన్న ప్రశ్నను హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ముందు ఉంచితే – ‘‘మనం ఏ పని చేసినా ఓ రిజల్ట్‌ ఉంటుంది. అది విజయమే కానక్కర్లేదు. అంతమాత్రాన బెంగ పెట్టుకుని సమయాన్ని వృథా చేయడం సరికాదు. నేను నటించిన సినిమాలన్నీ సక్సెస్‌ అవుతాయని చెప్పలేను. అది నా చేతిలో లేదు. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, కథలోని నా పాత్రలకు పూర్తి న్యాయం చేసేలా కృషి చేయడమే నా పని. జయాపజయాలు ముఖ్యం కాదు.

మన ప్రయాణంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ తప్పులు దిద్దుకుంటూ ముందుకు వెళ్లడమే జీవితం. యాక్టర్‌ కావాలని చాలామంది కలలు కంటుంటారు. ఆ అదృష్టం నాకు దక్కినందుకు ఆనందంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు. మరి లవ్‌ లైఫ్‌ సంగతేంటి? అని అడిగినప్పుడు – ‘‘ప్రస్తుతానికి సింగిలే. నా మనసుకు నచ్చిన వ్యక్తితో మింగిల్‌ అవడానికి సిద్ధమే. అతను వయసులో పెద్దవాడా? చిన్నవాడా? అనే పట్టింపు నాకు లేదు’’ అని రకుల్‌ పేర్కొన్నారు. ఇటు సౌత్‌ అటు నార్త్‌ సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారీ బ్యూటీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement