దయచేసి ఆ ప్రచారం మానండి! | rakul preet singh Please Avoid the campaign | Sakshi
Sakshi News home page

దయచేసి ఆ ప్రచారం మానండి!

Published Wed, Jul 15 2015 11:37 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

దయచేసి ఆ ప్రచారం మానండి! - Sakshi

దయచేసి ఆ ప్రచారం మానండి!

 సినిమా తారలు సినిమాల్లో నటించడం మినహా... వ్యక్తిగతంగా ఏం చేసినా హాట్ టాపిక్ అవుతుంది. ఏమీ చేయకపోయినా వివాదాల్లోకి లాగేస్తుంటారు. ప్రస్తుతం రకుల్ ప్రీత్‌సింగ్ విషయంలో ఇదే జరిగింది. ఆమె గురించి గాసిప్పురాయుళ్లు ఓ వార్త ప్రచారం చేస్తున్నారు. ‘‘ఆ ప్రచారం నిజం కాదు. దయచేసి మానండి’’ అని సామాజిక మాధ్యమం ద్వారా రకుల్ అభ్యర్థించాల్సి వచ్చింది. ఇంతకీ ఆమె గురించి ప్రచారమవుతున్న వార్త ఏంటంటే... ‘‘తమన్నా, కాజల్‌తో నన్ను పోల్చవద్దు. వాళ్లు బాలీవుడ్‌లో పరాజయాలు చవిచూశారు.
 
 వాళ్లతో నాకు పోలికేంటి’’ అని రకుల్ అన్నారన్నది సారాంశం. పలు వెబ్‌సైట్లలో వచ్చిన ఈ వార్త లండన్‌లో ఉన్న రకుల్‌కు చేరింది. దాంతో చాలా బాధపడిపోయారామె. ‘‘సీనియర్లతో నన్ను నేను పోల్చుకోను. ‘వాళ్ల దగ్గర్నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను’ అని మాత్రమే చెబుతుంటాను. కానీ, జరుగుతున్న ప్రచారం వేరే విధంగా ఉంది. నేను ఇండియాలోనే లేను. ఉన్నా నా సీనియర్ల గురించి అలాంటి మాటలు మాట్లాడను. మరి... సీనియర్ల గురించి నేను చేయకూడని కామెంట్లు ఎక్కడ చేశానో నాకే తెలియడం లేదు’’ అని రకుల్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement