అతిలోక సుందరిగా..! | Rakul Preet Singh Roped In To Play Sridevi In NTR Biopic | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 7 2018 11:03 AM | Last Updated on Sun, Oct 7 2018 4:51 PM

Rakul Preet Singh Roped In To Play Sridevi In NTR Biopic - Sakshi

నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న సినిమా యన్‌.టి.ఆర్‌. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమాలో తొలి భాగంలో ‘యన్‌.టి.ఆర్‌ కథానాయకుడు’లో నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాలను చూపించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో ఏఎన్నార్‌గా సుమంత్‌, చంద్రబాబు నాయుడిగా రానా, సావిత్రి పాత్రలో నిత్యామీనన్‌ కనిపిస్తున్నారు.

తాజాగా ఎన్టీఆర్‌తో సూపర్‌ హిట్ చిత్రాల్లో నటించిన శ్రీదేవి పాత్రకు యువ కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ను ఫైనల్‌ చేశారు. ఈ విషయాన్ని రకుల్‌ అధికారికంగా ధృవీకరించారు. యన్‌.టి.ఆర్‌ నటించటంపై స్పందించిన రకుల్‌.. ‘ప్రస్తుతం అందరి కళ్లు నామీదే ఉన్నాయి. అందుకే శ్రీదేవి పాత్రలో నటించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నేను కూడా ఆమె అభిమానినే. ఆమె పాత్రను వెండితెర మీద చూపించటం చాలా పెద్ద సాహసం. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంద’న్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement