చీప్‌ కామెంట్‌కు రకుల్ కౌంటర్‌ | Rakul Preet Singh Strong Reply to Twitter Comment | Sakshi
Sakshi News home page

Published Thu, Jan 17 2019 10:31 AM | Last Updated on Thu, Jan 17 2019 4:43 PM

Rakul Preet Singh Strong Reply to Twitter Comment - Sakshi

సినీ తారలకు సోషల్‌ మీడియా ద్వారా ఎదురయ్యే ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లను ఉద్దేశించి ఆకతాయిలు చేసే కామెంట్స్ శ్రుతిమించుతున్నాయి. తాజాగా సౌత్ స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.  రకుల్ కారునుంచి దిగుతున్న ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసిన ఓ వ‍్యక్తి (@bhagath9_9 అనే ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి) అసభ్యకర కామెంట్స్ చేశాడు.

అయితే ఈ పోస్ట్ రకుల్‌ దృష్టికి వెళ్లటంతో ఆమె ఆ వ్యక్తి దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చింది. ఇలాంటి మనుషులు ఉన్నంత వరకు మహిళలకు రక్షణ లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కేవలం సమానత్వం, రక్షణ అంటూ చర్చలు జరపటం వల్ల ఉపయోగం లేదంటూ కామెంట్ చేసింది రకుల్‌. అయితే రకుల్‌ ఇచ్చిన సమాధానంపై కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నెటిజన్లు రకుల్ ధైర్యాన్ని అభినందిస్తుంటే.. మరికొందరు  ‘నీపై వచ్చిన కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చేందుకు నువ్వు కూడా ఓ మహిళనే అవమానించావ్‌’ అంటూ సెటైర్స్‌ వేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement