అలాంటి మగాడు కావాలి : రకుల్‌ | Rakul Preet Singh Talk About Her Partner | Sakshi
Sakshi News home page

అలాంటి మగాడు కావాలి : రకుల్‌

Published Fri, Mar 23 2018 6:56 AM | Last Updated on Thu, Aug 9 2018 7:30 PM

Rakul Preet Singh Talk About Her Partner - Sakshi

సాక్షి, సినిమా: నేను పెళ్లి చేసుకునేవాడు అంతకు మించినోడయి ఉండాలంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. ఇంతకు ముందు టాలీవుడ్‌లో ఒక ఊపు ఊపేసిన ఈ బ్యూటీకిప్పుడు అక్కడ జోరు తగ్గింది. ఏఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జంటగా నటించిన స్పైడర్‌ చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లో ఒక లెవల్‌కు రావాలని ఆశించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌కు ఆ చిత్రం గట్టిదెబ్బే కొట్టింది. దీంతో విజయ్‌తో రొమాన్స్‌ చేసే అవకాశం చేజారిపోయింది. అయితే కార్తీతో జత కట్టిన ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్ర విజయ్‌ రకుల్‌కు కాస్త ఊరటనిచ్చింది. ప్రస్తుతం సూర్యకు జంటగా నటిస్తున్న చిత్రం కోసం ఎదురుచూస్తోంది. హిందీలో రెండు అవకాశాలను దక్కించుకున్న రకుల్‌ దక్షిణాదిలోనే మరిన్ని చిత్రాల్లో నటించాలని తనే స్వయంగా అవకాశాల వేట ప్రారంభించిదట. 

ఇటీవల ఈ బ్యూటీ ఇచ్చిన భేటీలో నేను ఆధ్యాత్మిక బాటలో పయనించడం ప్రారంభించాను. చిన్న తనంలోనే భక్తి పుస్తకాలను ఇష్టంగా చదివేదాన్ని. అవే నా మనసులో ఆధ్యాత్మిక చింతన కలిగించాయి. చాలా మంది నటీమణులు తమ కెరీర్‌కు ప్రణాళికలను రచించుకుంటారు. తనకలాంటివేవీలేవు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం వల్ల మంచి విషయాలు వాటంతట అవే అమరుతున్నాయి. నిజం చెప్పాలంటే నేను నటినికావాలని కోరుకోలేదు. పాకెట్‌ మనీ కోసమే నటించడానికి వచ్చాను. కెమెరా ముందుకు వచ్చిన తరువాతే నటనను కొనసాగించాను. నిబద్ధతలో జీవిస్తే ప్రణాళికలు లాంటివి అవసరం లేదు. నేను ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉండడం వల్ల పరిణితి చెందాను. మంచి కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటిస్తున్నాను. 10 ఏళ్ల తరువాత తిరిగి చూసుకుంటే ప్రతి చిత్రం గుర్తిండిపోవాలి.  సినిమా నిరంతరం కాదు. అభిమానుల ఆదరణ ఉన్నంతవరకూ దిక్కడ కొనసాగగలం. అందుకే విదేశీ నిపుణులతో కలిసి హైదరాబాద్‌లో జిమ్‌ను ప్రారంభించాను. ఎలాంటి మగాడు మీకు నచ్చుతాడు అని అడుగుతున్నారని, తన ఎత్తు 5.9 అడుగులని, అంతకు మించిన ఎత్తు కలిగిన వాడై ఉండాలి అని రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement