కార్తీతో తొలిసారి.. | Rakul with karthi for the first time | Sakshi
Sakshi News home page

కార్తీతో తొలిసారి..

Published Mon, Jan 23 2017 1:41 AM | Last Updated on Sat, Aug 3 2019 1:14 PM

కార్తీతో తొలిసారి.. - Sakshi

కార్తీతో తొలిసారి..

ధీరన్  అధికారం ఒండ్రు చిత్రం గుజరాత్‌లో చిత్రీకరణకు సిద్ధం అవుతోంది.యువ స్టార్‌ హీరో కార్తీ నటిస్తున్న తాజా చిత్రం ధీరన్  అధికారం ఒండ్రు. ఈయన కాష్మోరా తరువాత ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కాట్రువెలియిడై చిత్రాన్ని పూర్తి చేశారు. ఇది మణిరత్నం స్టయిల్‌లో విభిన్న ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతోంది. రోజా చిత్రం తరువాత అధిక భాగం చిత్రీకరణను కాశ్మీర్, ఊటీ, నిలగిరి ప్రాంతాల్లో జరుపుకున్న చిత్రం కాట్రువెలియిడై.

ముంబై బ్యూటీ అధితి హైదరి నాయకిగా నటిస్తున్న ఇందులో శ్రద్ధాశ్రీనాథ్, ఆర్‌జే.బాలాజీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్‌.రెహ్మాన్  సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని మెడ్రాస్‌ టాకీస్‌ సంస్థ నిర్మిస్తోంది. కాట్రువెలియిడై ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కార్తీ తన తాజా చిత్రం ధీరన్  అధికారం ఒండ్రు చిత్రంపై దృష్టి సారించారు. చతురంగవేట్టై చిత్రం ఫేమ్‌ వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఇందులో రకుల్‌ప్రీతిసింగ్‌ నాయకిగా నటిస్తున్నారు. కార్తీ, రకుల్‌ తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. అదే విధంగా చాలా గ్యాప్‌ తరువాత రకుల్‌ కోలీవుడ్‌కు రీఎంట్రీ అవుతున్నారు.

చిరుతై చిత్రం తరువాత కార్తీ పోలీస్‌ అధికారిగా అంతకంటే పవర్‌ఫుల్‌ పాత్రలో ధీరన్  అధికారం ఒండ్రు చిత్రంలో కనిపించనున్నారట. ఇప్పటికే చెన్నైలో పది రోజులు షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్‌ను గుజరాత్‌లో జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. గుజరాత్‌కు పది కిలోమీటర్ల దూరంలోని కొండప్రదేశంలో 41 రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్‌ నిర్వహించడానికి చిత్ర యూనిట్‌ సిద్ధమవుతున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి జిబ్రాన్  సంగీత బాణీలు కడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement