Ram Charan and Boyapati Srinu New Movie Stills Leaked - Sakshi

Oct 16 2018 10:58 AM | Updated on Oct 16 2018 1:50 PM

Ram Charan Boyapati Srinu Movie Stills Leaked - Sakshi

మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి మార్క్‌ మాస్ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో భరత్‌ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2019 సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

ఇంతవరకు చిత్రయూనిట్ ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వకపోవటంతో అభిమానులు ఫస్ట్‌లుక్‌, టైటిల్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన స్టిల్స్‌ లీకయ్యాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా స్టార్ హీరోల సినిమాలకు లీకుల బెడద మాత్రం తప్పటం లేదు. ఈ సినిమాలో సీనియర్‌ హీరో ప్రశాంత్‌ చెర్రీ అన్నగా కనిపిస్తుండగా బాలీవుడ్ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement