
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో భరత్ అనే నేను ఫేం కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభమై చాలా కాలం అవుతున్న ఇంత వరకు టైటిల్‌గాని లుక్ గాని రివీల్ చేయలేదు.
అందుకే మెగా అభిమానుల కోసం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా పవన్ పుట్టిన రోజున చరణ్ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ పై అభిమానుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.